షాక్: మహిళా యాంకర్ ప్రాణం తీసిన కొబ్బరి చెట్టు(వీడియో)
కొబ్బరి చెట్టు ఓ టీవీ యాంకర్ ప్రాణం తీసింది. రోడ్డు వెళుతున్న మహిళా టీవీ యాంకర్‌పై హఠాత్తుగా ఓ కొబ్బరి చెట్టు ఆమెపై పడింది. నేరుగా ఆమె తలపై బలంగా తగలడంతో ఆ యాంకర్ ప్రాణాలు వదిలింది.
ముంబై: కొబ్బరి చెట్టు ఓ టీవీ యాంకర్ ప్రాణం తీసింది. రోడ్డు వెళుతున్న మహిళా టీవీ యాంకర్‌పై హఠాత్తుగా ఓ కొబ్బరి చెట్టు ఆమెపై పడింది. నేరుగా ఆమె తలపై బలంగా తగలడంతో ఆ యాంకర్ ప్రాణాలు వదిలింది. ఈ విషాద ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో చోటు చేసుకుంది.
కాగా, స్థానికంగా ఉన్న ఓ సీసీ టీవీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. బాధిత మహిళను దూరదర్శన్ మాజీ యాంకర్ కంచన్ నాథ్(58)గా గుర్తించారు. ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది.
దూరదర్శన్ మాజీ యాంకర్, యోగ టీచర్ కూడా అయిన కంచన్ నాథ్ గురువారం ఉదయం మార్నింగ్ వాక్ వెళ్లారు. ఇంటికి సమీపంలో నడుస్తుండగా రోడ్డు పక్కనేవున్న ఓ కొబ్బరిచెట్టు అకస్మాత్తుగా ఆమె మీద పడింది. బలంగా తలకు తగలడంతో తీవ్రగాయాలతో ఆమె స్పృహ కోల్పోయింది.
కాగా, స్థానికులు గమనించి హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం కంచన్ మృతి చెందింది. కంచన్ మృతికి ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యత వహించాలని కంచన్ కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు.
కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆ చెట్టును కొట్టివేయడానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో బీఎంసీ అనుమతి నిరాకరించిందని వారు ఆరోపించారు. బీఎంసీ నిర్లక్ష్యం కారణంగానే ఈ రోజు కంచన్ ప్రాణాలు కోల్పోయిందని వాపోయారు.












Click it and Unblock the Notifications