వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మమ్మీ, డాడీ ఎలా ఉన్నారు, నేను బాగానే ఉన్నా.. టెకీ ప్రశాంత్ వీడియో

|
Google Oneindia TeluguNews

Recommended Video

మమ్మీ, డాడీ ఎలా ఉన్నారు, నేను బాగానే ఉన్నా.. టెకీ ప్రశాంత్ వీడియో

కొన్ని సందర్భాల్లో జరిగే ఘటనలు ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. అవును నిజమే, ఏపీకి చెందిన ప్రశాంత్ తన ప్రియురాలిని కలిసేందుకు బయల్దేరారు. విధి విచిత్రమో ఏమో గానీ ఆయన స్విట్జర్లాండ్ బయల్దేరితే.. పాకిస్థాన్‌లోన కొలిస్థాన్ ఎడారిలో తేలారు. దీంతో అక్కడి అధికారులు అదుపులోకి తీసుకుని ఆరా తీస్తే అసలు విషయం వెలుగుచూసింది. తాను బాగానే ఉన్నానని ఓ వీడియో కూడా పోస్ట్ చేశారు.

స్విట్జర్లాండ్ కాదు..

స్విట్జర్లాండ్ కాదు..

ఏపీలోని విశాఖపట్టణానికి చెందిన ప్రశాంత్ సాప్ట్‌వేర్ ఇంజినీర్. హైదరాబాద్‌లో ఓ కంపెనీలో పనిచేసేవాడు. అయితే ఆయన తన ప్రియురాలి కోసం స్విట్జర్లాండ్ వెళ్లాడు. కానీ పాకిస్థాన్‌లోని కొలిస్థాన్ ఎడారిలో సమీపంలో గల బహవల్‌పూర్‌లో ఈ నెల 14వ తేదీన కనిపించాడు. అతనికి వీసా, సరైన ధ్రువపత్రాలు లేకపోవడంతో పాకిస్థాన్ అధికారులు పోలీసు స్టేషన్‌కు తరలించారు.

గర్ల్‌ఫ్రెండ్ కోసం

గర్ల్‌ఫ్రెండ్ కోసం

తనకు ఆన్‌లైన్‌లో పరిచయమైన గర్ల్ ఫ్రెండ్ కోసం ప్రశాంత్ బయల్దేరాడు. కానీ పాకిస్థాన్‌లో కనిపించడంతో కలకలం రేగింది. దీంతో ఓ వీడియో మేసేజ్ తన తల్లిదండ్రులకు పంపించాడు. అతను గర్ల్‌ఫ్రెండ్ కోసం వెళ్లాడనే అంశాన్ని ప్రశాంత్ పేరెంట్స్ కొట్టిపారేస్తున్నారు.

ప్రశాంత్ వీడియో..

‘మమ్మీ డాడీ బాగున్నారా.. ఇక్కడ బాగానే ఉన్నానని చెప్పారు. ఎలాంటి ఇబ్బంది లేదని వారికి ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. పోలీసుస్టేషన్ నుంచి కోర్టుకు తీసుకొచ్చారని చెప్పారు. ఇక్కడినుంచి జైలుకు వెళతానని.. తర్వాత ఇండియన్ ఎంబసీతో మాట్లాడతానని చెప్పారు. పాకిస్థాన్-భారత్ మధ్య ఉన్న ఖైదీల ఒప్పంద ప్రకారం అప్పగింత ఉంటుందని చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తవడానికి నెలరోజుల సమయం పడుతుంది' అని ప్రశాంత్ చెప్పారు. పాకిస్థాన్ భూభాగంలో ఎలా అడుగుపెట్టాననే అంశాన్ని మాత్రం ప్రశాంత్ వివరించలేదు.

రెండేళ్ల క్రితమే..?

రెండేళ్ల క్రితమే..?

కూకట్‌పల్లిలో ఉంటూ ఐటీ కంపెనీలో ప్రశాంత్ పనిచేసేవాడు. 2017 ఏప్రిల్ 21న ఆఫీసుకు వెళ్లి తిరిగిరాలేడని పేరెంట్స్ చెబుతున్నారు. మాదాపూర్ పోలీసుస్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు. ఏడాది తర్వాత పాకిస్థాన్‌లో ఉన్నాడని పోలీసులు చెబితే పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు వీడియో చూసి నిజమని నిర్ధారించుకున్నామని.. ప్రశాంత్‌ను క్షేమంగా భారత్ తీసుకొచ్చే ప్రయత్నాలు చేయాలని వారు భారత రాయబార కార్యాలయ అధికారులను కోరుతున్నారు.

English summary
Mummy and daddy, how are you? Now they brought me to court from police station after it was declared that there was no problem telugu techie prashanth on vedio.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X