రాజ్‌నాథ్‌కు టర్బన్ పెట్టిన హత్య కేసు నిందితుడు

గత శనివారం రాజ్‌నాథ్ సింగ్ శ్రీపద్మనాభ స్వామి ఆలయాన్ని సందర్శించారు. ప్రార్థనల తర్వాత ఆలయం నుంచి మంత్రి వెలుపలికి వచ్చారు. అలా రాగానే ఆర్ఎస్ఎస్ కార్యకర్త సంతోష్ దగ్గరకు వచ్చి స్థానిక బిజెపి నాయకులు, భద్రతా సిబ్బంది అనుమతితో రాజ్‌నాథ్ తలను టర్బన్‌తో అలంకరించారు.
2008లో జరిగిన డివైఎఫ్ఐ కార్యకర్త విష్ణు హత్య కేసులో సంతోష్ ప్రధాన నిందితుడు. ప్రస్తుతం అతను బెయిల్‌పై బయట ఉన్నాడు. ఈ వివాదంపై రాష్ట్ర హోం శాఖ మంత్రి రమేష్ చెన్నితల స్పందించారు. అది తీవ్రమైన విషయమేనని, అయితే రాష్ట్ర ప్రభుత్వపరంగా ఏ విధమైన భద్రతా లోపాలు లేవని, రాజ్‌నాథ్ సింగ్ భద్రత జాతీయ భద్రతా గార్డ్స్ (ఎన్ఎస్‌జి) చేతిలో ఉంటుందని ఆయన వివరించారు.
సంతోష్ రాజ్‌నాథ్ సింగ్‌కు టర్బన్ ప్రదానం చేస్తున్న దృశ్యాలు స్థానిక మీడియాలో వచ్చాయి. ఈ సంఘటనపై విచారణ జరిపించాలని, ఈ సంఘటనపై కాంగ్రెసు నేతృత్వంలోని యుడిఎఫ్ ప్రభుత్వం, బిజెపి రాష్ట్ర శాఖ వివరణ ఇవ్వాలని సిపిఐ శాసనసభ్యుడు వి శివకుట్టి డిమాండ్ చేశారు. సిపిఎం ఈ సంఘటనపై అనవసర రాద్ధాంతం చేస్తోందని బిజెపి జిల్లా అధ్యక్షుడు ఎస్ సురేష్ అన్నారు.












Click it and Unblock the Notifications