బాబ్రీ తీర్పుపై అప్పీలుకు ముస్లిం సంఘాల నిర్ణయం-త్వరలో హైకోర్టులో పిటిషన్
28 ఏళ్ల నాటి బాబ్రీ మసీదు కూల్చివేత వ్యవహారంలో లఖ్‌నవూలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై ముస్లిం సంఘాలు భగ్గుమన్నాయి. సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు వాస్తవాలను విస్మరించేలా ఉందని ఆరోపిస్తున్న ముస్లిం సంఘాలు దీనిపై తదుపరి న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నాయి.
1992 నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ అగ్రనేతలు అద్వానీ, జోషీ, ఉమాభారతి సహా 32 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు ఇవాళ ఇచ్చిన తీర్పుపై ముస్లిం సంఘాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది ఈ తీర్పులో సీబీఐ సరైన సాక్ష్యాధారాలు సమర్పించడంలో విఫలమైందని వారు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ తీర్పును హైకోర్టులో సవాలు చేయాలని నిర్ణయించాయి. తీర్పుపై స్పందించిన ముస్లిం పర్సనల్ లాబోర్డుతో పాటు బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీ కూడా ఈ తీర్పును హైకోర్టులో సవాలు చేస్తామని ప్రకటించాయి. దీంతో ఈ వ్యవహారం తిరిగి అలహాబాద్ హైకోర్టుకు చేరబోతోంది.

బాబ్రీ మసీదు కూల్చివేతపై సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పులో తప్పులు ఉన్నాయని, వీటిని హైకోర్టులో సవాలు చేస్తామని బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీ కన్వీనర్ జఫర్యాబ్ జిలానీ ప్రకటించారు. ముస్లిం పర్సనల్ లాబోర్డు కూడా దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ముస్లిం పర్సనల్ లాబోర్డు తరఫున హైకోర్టులో దాఖలు చేసే పిటిషన్లో భాగస్వామి అవుతానని ఇప్పటికే ప్రకటించారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications