ఆలయంలోకి ప్రవేశించాడని ముస్లిం కుర్రాడ్ని చావబాదారు: హిందూ ఏక్తా సంఘ్ కలకలం

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆలయంలోకి ప్రవేశించాడనే కారణంతో ఓ కుర్రాడ్ని కొందరు యువకులు చావగొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. నిందితులు హిందూ ఏక్తా సంఘ్ ప్రతినిధులుగా గుర్తించారు. భారతీయ జనతా పార్టీకి అనుబంధ సంఘంగా దీన్ని భావిస్తున్నారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటిదాకా ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారిపై కేసులు నమోదు చేశారు.

ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. 12 నుంచి 14 సంవత్సరాల్లోపు వయస్సు ఉన్న ఆ బాలుడు మంచినీళ్లు తాగడానికి ఘజియాబాద్ రూరల్ పరిధిలోని ఓ ఆలయంలోకి వెళ్లాడు. దీన్ని గుర్తించిన శృంగి నందన్‌ యాదవ్‌ అనే యువకుడు ఆ బాలుడిని పట్టుకుని వివరాలు తెలుసుకున్నాడు. అతను ముస్లిం కావడంతో ఆలయంలో ఎందుకు వచ్చావని నిలదీశాడు. దొంగతనం చేయడానికి వచ్చావా? అంటూ ప్రశ్నించాడు. నీళ్లు తాగేందుకు వచ్చానని బాలుడు సమాధానం ఇచ్చాడు.

Muslim boy allegedly thrashed for entering temple to drink water, two arrested

చోరీ చేయడానికి వచ్చి ఉంటావంటూ అతణ్ని కొట్టడం వీడియోలో రికార్డయింది. నందన్ యాదవ్ స్నేహితుడు ఈ వీడియోను చిత్రీకరించాడు. ఆ బాలుడిని కింద పడేసి, కొట్టాడు. దీనితో అతని తలకు గాయాలయ్యాయి. అనంతరం ఈ వీడియోను వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది వైరల్‌గా మారింది. ఈ వీడియో తమ దృష్టికి వచ్చిన వెంటనే పోలీసులు స్పందించారు. నిందితుడితో పాటు వీడియోను చిత్రీకరించిన అతని స్నేహితుడు శివానంద సరస్వతిని అరెస్ట్ చేశారు.

నందన్ యాదవ్ బిహార్‌లో భాగల్‌పూర్‌కు చెందిన వాడిగా గుర్తించారు. నిందితుడు మూడు నెలలుగా ఆలయంలోనే నివాసం ఉంటున్నాడని చెప్పారు. వారిపై ఐపీసీలోని సెక్షన్ 323, 504లతో పాటు ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు ఘజియాబాద్ రూరల్ ఎస్పీ ఇరాజ్ రజా తెలిపారు. ఈ కేసులో ఆలయ ట్రస్టీలను ప్రశ్నించామని, నందన్ యాదవ్ కొంతకాలంగా గుడిలోనే ఉంటున్నట్లు వెల్లడించారని పేర్కొన్నారు. నిరుద్యోగి కావడంతో ఆలయంలోనే నివసిస్తున్నట్లు తెలిపారని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+