హిందువులు ఎక్కువ మందిని కనాలి, ముస్లిం జనభా తగ్గించాలి, ధర్మ సంసద్‌లో!

దేశంలో ముస్లీం జనాభా పెరిగిపోతుంది, ఇద్దరు పిల్లల విధానం పక్కన పెట్టండిప్రతి హిందువూ నలుగురు కంటే ఎక్కువ మందిని కనాలి, లేదంటే మనం మైనారిటీలు అయిపోతాంధర్మ సంసద్ లో తీర్మాణం చేద్దాం, ప్రధాని మోడీకి మన

ఉడిపి/బెంగళూరు: ప్రతి హిందువూ నియమాలు పక్కన పెట్టి ఓకరిద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనాలని పలువురు స్వామీజీలు అభిప్రాయం వ్యక్తం చేశారు. భారతదేశంలో హిందువుల జనాభా పెరగాలంటే అంతకంటే మరో మార్గం లేదని స్వామీజీలు అన్నారు.

కర్ణాటకలోని ఉడపిలో జరుగుతున్న ధర్మ సంసద్ 2017 కార్యక్రమం రెండో రోజు శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి దేశంలోని దాదాపు 2 వేల మంది మఠాధిపతులు, పీఠాధిపతులు, ఆర్ఎస్ఎస్, వీహెచ్ పీ నేతలు హాజరైనారు. శనివారం భారతదేశ జనభా, హిందూ, ముస్లీంల జనభా మధ్య వ్యత్యాసం విషయంలో తీవ్రస్థాయిలో చర్చ జరిగింది.

ప్రతి హిందువుకు టార్గెట్ !

ప్రతి హిందువుకు టార్గెట్ !

భారతదేశంలోని ప్రతి హిందువు నలుగురు కంటే ఎక్కువ మంది పిల్లలను కనాలంటూ ఉత్తరాఖండ్ లోని హరిద్వార్‌ పీఠాధిపతి స్వామి గోవింద్ దేవ్ గిరిరాజ్ మహరాజ్ చెప్పారు. దేశంలో కామన్‌ సివిల్‌ కోడ్‌ అమల్లోకి వచ్చే వరకు ప్రతి హిందువు ఎక్కువ మంది పిల్లలను కనాలని స్వామీ గోవింద్ దేవ్‌ గిరిరాజ్‌ మహరాజ్‌ పిలుపునిచ్చారు.

దేశంలో హిందులు తగ్గిపోతున్నారు !

దేశంలో హిందులు తగ్గిపోతున్నారు !

ప్రతి హిందువు ఎక్కువ మంది పిల్లలను కనేలా చేస్తే దేశంలో హిందువులు, ముస్లీంల జనాభాను సమతుల్యంగా ఉంచడం సాధ్యమవుతుందని స్వామి గోవింద్ దేవ్ గిరిరాజ్ మహరాజ్ చెప్పారు. ఇద్దరు పిల్లల విధానం వల్ల హిందువుల జనాభా దేశంలో తగ్గుముఖం పడుతోందని స్వామి గోవింద్ దేవ్ గిరిరాజ్ మహరాజ్ ఆందోళన వ్యక్తం చేశారు.

అందరికీ ఒకే చట్టం ఉండాలి

అందరికీ ఒకే చట్టం ఉండాలి

ఇద్దరు పిల్లల విధానాన్ని భారతదేశంలో అందరికీ వర్తింపచేసే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని స్వామి గోవింద్ దేవ్ గిరిరాజ్ మహరాజ్ మనవి చేశారు. దేశంలో హిందువుల జనాభా అధికం అయ్యేలా చెయ్యాలని, అందుకు ప్రతి హిందువూ ఎక్కువ మంది పిల్లల్ని కనాలని స్వామి గోవింద్ గిరిరాజ్ మహరాజ్ పిలుపునిచ్చారు.

హిందువులు మైనారీలు అయిపోతారు !

హిందువులు మైనారీలు అయిపోతారు !

రాజస్థాన్ కు చెందిన హరిశంకర్ దాస్ స్వామిజీ మాట్లాడుతూ దేశంలో ముస్లీంల జనాభా ఎక్కువ అయిపోతుందని, హిందువులు మైనారిటీలుగా మారే పరిస్థితి వస్తుందోమో అనే భయంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ప్రతి దంపతులు ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలను కనకూడదని ధర్మ సంసద్ కార్యక్రమంలో తీర్మాణం ప్రవేశ పెట్టాలని అన్నారు.

మోడీకి మనవి చేద్దాం

మోడీకి మనవి చేద్దాం


ధర్మ సంసద్ లో చేసిన తీర్మాణ పత్రాలను ప్రధాని నరేంద్ర మోడీకి అందజేసి ఆ చట్టం అమలులోకి తీసుకురావాలని మనవి చేద్దామని హరిశంకర్ దాస్ స్వామీజీ చెప్పారు. ఇదే సందర్బంలో ఆర్ఎస్ఎస్, వీహెచ్ పీ, వివిధ మఠాలుకు చెందిన మఠాధిపతులు ప్రసంగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+