30 మందిని కనిపెట్టాలి.. సీఎంలతో మీట్ నేపథ్యంలో ప్రధాని మోడీ
కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో ప్రధాని మోడీ సీఎంలో ఇంటరాక్ట్ అయ్యారు. వర్చువల్‌గా మాట్లాడిన మోడీ.. దేశంలో 4 రోజుల్లో లక్ష మార్క్ కరోనా కేసులు పెరిగినందున సమావేశం అయ్యారు. గురువారం ఒక్కరోజే లక్ష పైచిలుకు కేసులు వచ్చాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
కరోనా వైరస్ కేసులకు సంబంధించి ఇదివరకు కూడా సీఎంలతో మోడీ ఇంటరాక్ట్ అయ్యారు. కేసులు పెరిగితే ఎలా అనే అంశంపై సమీక్షించారు. కరోనా కేసులకు సంబంధించి పంచ సూత్రాలు పాటించాలని కోరారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్ చేయాలని కోరారు. వైరస్ కోసం వ్యాక్సిన్ కూడా విధిగా తీసుకోవాలని కోరారు. అలాగే వైరస్ సోకిన వ్యక్తి నుంచి 30 మంది వరకు సోకే అవకాశం ఉందని.. వారిని ట్రేస్ చేయాలని కోరారు.

కరోనా సమయంలో రాజకీయాలు చేయొద్దని మోడీ సూచించారు. వైరస్ సమూల నియంత్రణ కోసం కలిసి పనిచేయాలని అభిప్రాయపడ్డారు. కరోనాపై పోరాడేందుకు తమతో పాటు సీఎంలు కలిసి రావాలని కోరారు. ఎన్సీసీ క్యాడెట్లు/ వారి కుటుంబాలకు సాయం చేయాలని మోడీ అన్నారు. వ్యాక్సిన్ కోసం ఆ కుటుంబాలు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఓకే అని.. అలా లేకుంటే సాయం చేయాలన్నారు.