బీహార్ రాజకీయాల్లో 'మటన్' రచ్చ.. ఏంటి ఈ లొల్లి ?
బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార ఎన్డీఏ కూటమి (బీజేపీ - జేడీయూ) , ప్రతిపక్ష ఆర్జేడీ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరుతోంది. ఓటర్లను ఆకర్షించేందుకు ఆయా పార్టీలు తమదైన శైలిలో సై అంటే సై అంటూ వివాదాలకు తెరలేపుతున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా మటన్ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది.
అసలు ఏంటి ఈ ఇష్యూ..!
పట్నాలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో విందు భోజనంలో "మటన్" వంటకం వడ్డించడంపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. శ్రావణ మాసంలో మాంసాహారం వడ్డించడం హిందూ సంప్రదాయాలను మంటగలపడమేనని ఆరోపించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు.

ఆ పోస్టులో... బీజేపీ నేతలు ఒకవైపు సనాతన ధర్మం గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారని.. కానీ ఆ ఆచారాలను పాటించరని విమర్శించారు. మోడీ మంత్రివర్గంలోని ముగ్గురు నేతలు రోజూ మటన్ తింటారని ఎద్దేవా చేస్తూ, "ఇతరుల ఆహారపు అలవాట్లపై విమర్శలు చేసే ముందు వారు తమను తాము పరిశీలించుకోవాలని అన్నారు.
అంతేకాకుండా గతంలో తమపై బీజేపీ చేసిన ఆరోపణలను గుర్తుచేశారు. 2023లో శ్రావణ మాసంలో రాహుల్ గాంధీకి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మటన్ విందు ఇచ్చిన సమయంలో బీజేపీ తీవ్రంగా విమర్శించిన విషయాన్ని ప్రస్తావించారు. అలానే 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో నవరాత్రుల్లో తేజస్వి చేపలు తిన్నారంటూ బీజేపీ నేతలు విమర్శలు చేశారు.
प्रधानमंत्री श्री @narendramodi जी के असीम आशीर्वाद और कृपा से सावन के सोमवारी को दबा कर मटन 🥩 चापते बीजेपी के मंत्री और विधायक।
— Tejashwi Yadav (@yadavtejashwi) July 21, 2025
मोदी जी की कैबिनेट में बिहार से तीन ऐसे मंत्री है जो सावन में भी प्रतिदिन 3 किलो मटन खाते है लेकिन दिखावटी तौर पर सनातन पर लंबा चौड़ा ज्ञान देते है।… pic.twitter.com/NuvuOwEzKy
రానున్న రోజుల్లో ఈ మాటల యుద్ధం ఎంతటి పరిణామాలకు దారి తీస్తుందో అని జోరుగా చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications