సీఎం కుర్చీపై అప్పుడే కర్చీఫ్..!!

బెంగళూరు: అత్యంత ఉత్కంఠత రేకెత్తించిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ఆరంభమైంది. ఫలితాలు వెలువడుతున్న కొద్దీ సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రారంభ ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ హోరాహోరీగా పోరాడుతున్నాయి. జనతాదళ్ (సెక్యులర్) ఫర్వాలేదనిపించుకుంటోంది. ప్రారంభంలో ఉన్న ట్రెండ్‌ను బట్టి చూస్తే హంగ్ అసెంబ్లీ ఏర్పడొచ్చనే అంచనాలు ఉన్నాయి.

ప్రారంభ ఫలితాల్లో ఏ పార్టీకి కూడా ఆధిక్యత లభించేలా కనిపించట్లేదు. కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా పోరాడుతున్నాయి. ఉదయం 9:45 నిమిషాలకు అందిన ట్రెండ్ ప్రకారం చూస్తే కాంగ్రెస్ 107 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. బీజేపీ అభ్యర్థులు 83 నియోజకవర్గాల్లో లీడింగ్‌లో కొనసాగుతున్నారు. జేడీఎస్ 30, ఇతరులు నాలుగు స్థానాల్లో ఆధిక్యతను సాధించింది. ఫలితాలు వెలువడుతున్న కొద్దీ ఆధిక్యత చేతులు మారుతూ వస్తోంది.

Karnataka Assembly Election Results 2023

ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై- షిగ్గావ్, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య-వరుణ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత డీకే శివకుమార్-కనకపురల్లో ఆధిక్యతలో కొనసాగుతున్నారు. టికెట్ దక్కకపోవడం వల్ల చివరి నిమిషంలో బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టార్ హుబ్లీ-ధర్వాడలో వెనుకంజలో ఉన్నారు. బీజేపీకే చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి లక్షణ సవాది- అథణి నియోజకవర్గంలో లీడింగ్‌లో ఉన్నారు.

చిక్‌బళ్లాపురాలో వైద్యారోగ్య శాఖ మంత్రి, బీజేపీ అభ్యర్థి డాక్టర్ కే సుధాకర్ వెనుకంజలో ఉన్నారు. మల్లేశ్వరం అభ్యర్థి, ఉప ముఖ్యమంత్రి డాక్టర్ అశ్వర్థనారాయణ ఆధిక్యతలో ఉన్నారు. కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం 113. ప్రారంభ ఫలితాల్లో ఈ మేజిక్ ఫిగర్‌ను అందుకునేలా కనిపించట్లేదు. ఇదే ట్రెండ్ చివరి వరకు కొనసాగితే హంగ్ అసెంబ్లీ ఏర్పడటం ఖాయంగా కనిపిస్తోంది.

Karnataka Assembly Election Results 2023

ఈ పరిస్థితుల మధ్య ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య కుమారుడు, కాంగ్రెస్ నేత యతీంద్ర సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. తన తండ్రే ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. కన్నడ ప్రజలు కోరిక మేరకు సిద్ధరామయ్యనే ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. తమ పార్టీ సంపూర్ణ మెజారిటీని సాధిస్తుందనే విశ్వాసం తనకు ఉందని, సిద్ధరామయ్యే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని తేల్చి చెప్పారు.

ఓ కుమారుడిగా తన తండ్రి సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటోన్నానని, తన హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారని, ప్రజలకు సుపరిపాలనను అందించారని యతీంద్ర అన్నారు. బీజేపీ పాలనలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలు, అవకతవకలను సిద్ధరామయ్య మాత్రమే సరిచేయగలరని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+