మోడీ ప్రభుత్వానిది దూరదృష్టి పాలన: రాష్ట్రపతి ప్రణబ్

న్యూఢిల్లీ: మంగళవారం ఉదయం పదకొండు గంటలకు పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. పార్లమెంటు సెంట్రల్ హాలులో మాట్లాడారు.

పేదల అభ్యున్నది, రైతుల సమృద్ధే ప్రభుత్వం లక్ష్యమని ప్రణబ్ చెప్పారు. దేశ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రైతులకు చేయూత, యువతకు ఉపాధి అవకాశాలు కోసం ప్రభుత్వం పథకాలు రూపొందిస్తోందన్నారు.

దేశాభివృద్ధికి ప్రభుత్వం దూరదృష్టితో పని చేస్తోందన్నారు. సబ్ కే సాత్ సబ్ కా వికాస్ అనే నినాదంతో ప్రభుత్వం ముందుకు పోతోందన్నారు. ప్రధాని జన్ ధన్ యోజన విజయవంతమైందన్నారు. పేదరిక నిర్మూలనకు జన్ ధన్ యోజన ఉపయోగపడుతుందన్నారు.

జన్ ధన్ యోజన ప్రపంచంలోనే అత్యంత ఆర్థిక వృద్ధి పథకమన్నారు. 2022 కల్లా అందరికీ ఇళ్లు ఉండాలనేది ప్రభుత్వం లక్ష్యమని, దానికి కట్టుబడి ఉందని చెప్పారు. దూరదృష్టితో దేశ అభివృద్ధికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఆహార భద్రత, అందరికీ ఇళ్లు వంటివి అత్యంత ప్రాధాన్యత అంశాలన్నారు.

ఆహార భద్రత వల్ల 68 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతోందన్నారు. రూ.24,600 కోట్లతో పట్టణ గృహనిర్మాణ పథకం అమలుచేస్తున్నామన్నారు. గ్రామీణ పేదలకు కొత్తగా 50 లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామన్నారు. జీవన్ జ్యోతి, అటల్ బీమా యోజనలు ప్రజలకు భరోసా ఇచ్చే పథకాలు అన్నారు.

సామాజిక న్యాయం, సమ్మిళిత అభివృద్ధి ప్రభుత్వం తొలి ప్రాధాన్యం అన్నారు. మైనార్టీ బడ్జెట్‌లో ముస్లీం విద్యార్థులకు యాభై శాతం ఉపకారవేతనాలు ఉంటాయన్నారు. రైతుల సంక్షేమం ద్వారానే దేశం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందన్నారు. మేకిన్ ఇండియా, ముద్ర, స్టార్టప్‌లను రాష్ట్రపతి గుర్తు చేశారు.

My govt's philosophy is captured in idea of 'Sabka Saath, Sabka Vikas', says President

రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుందాన్నారు. తక్కువ ప్రీమియంతో పంటల బీమా పథకం ద్వారా రైతులకు భరోసా ఇస్తున్నామన్నారు. భూసార పరీక్షల కార్డులు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. 8వేల క్లస్టర్ల ద్వారా ప్రకృతి వ్యవసాయం, రైతులకు గిట్టుబాటు ధర కోసం ఈ-మార్కెట్లు తీసుకు వచ్చామన్నారు.

తద్వారా దేశంలో ఎక్కడైనా పంట ఉత్పత్తులు అమ్ముకునే సౌలభ్యం కల్పించినట్లు చెప్పారు. కొత్త యూరియా విధానం తీసుకు వచ్చామన్నారు. కొత్త విధానం ద్వారా మూడేళ్లలో 17 లక్షల టన్నుల యూరియాను ఉత్పత్తు చేయనున్నట్లు వెల్లడించారు. యూరియాకు వేపపూత వల్ల రైతులకు ప్రయోజనం కలుగుతోందన్నారు.

గ్రామీణాభివృద్ధికి పాల ఉత్పత్తి, మత్స్య పరిశ్రమ, కోళ్ల పరిశ్రమ తదితరాలను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. రైతుల అభివృద్ధికి 109 కిసాన్ వికాస్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఐదు మెగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ప్రారంభించాయని చెప్పారు. గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు.

గ్రామీణాభివృద్ధి ద్వారా రూ.2లక్షళ కోట్ల మేర పనులు జరిగాయన్నారు. మేకిన్ ఇండియా, స్టార్టప్, ముద్ర ద్వారా అపార ఉపాధి అవకాశాలున్నాయన్నారు. మేకిన్ ఇండియా ద్వారా 39 శాతం విదేశీ పెట్టుబడులు వచ్చాయన్నారు. ముద్ర యోజన ద్వారా ఔత్సాహిక మహిళలకు ఇతోధికంగా రుణాలు ఇస్తున్నట్లు చెప్పారు.

నిరుద్యోగులను ఉద్యోగాలు ఇచ్చేవారిగా మార్చడమే మేకిన్ ఇండియా లక్ష్యమని చెప్పారు. హైకోర్టుల్లోను కమర్షియల్ డివిజన్లు ఏర్పాటు చేస్తామన్నారు. రైతుల కోసమే కిసాన్ ఛానల్ అన్నారు. లక్ష్యం మేరకు ప్రసూతి మరణాలు తగ్గించినట్లు చెప్పారు. ఆసుపత్రుల్లో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం అన్నారు.

యోగా, ఆయుర్వేదం, యునానీలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. స్వచ్ఛ భారత్ మిషన్ ప్రతి గ్రామానికి వెళ్లిందన్నారు. క్లీన్ ఇండియా, ఆరోగ్య భారత్ తమ ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. రైతులు ఆనందించే రోజులు త్వరలో రాబోతున్నాయన్నారు.

118 నగరాల్లో నమామి గంగా, వెయ్యికి పైగా గ్రామాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టామన్నారు. అవినీతిపరుల భరతం పట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.

సౌర, పవన విద్యుత్ పైన మరింత దృష్టి పెట్టామన్నారు. ఉజ్వల్ డిస్కమ్స్, అస్యూరెన్స్ యోజనాల ద్వారా రాష్ట్రాలకు విద్యుత్ పంపిణీ చేస్తున్నామన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు 71 శాతం విద్యుత్ సరఫరా సాధించామన్నారు. విద్య, ఆరోగ్యం, పరిశుభ్రతలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు.

ఒకే ర్యాంక్ - ఒకే పింఛన్ నాలుగు దశాబ్దాల ఆకాంక్ష అని దానిని నెరవేర్చామన్నారు. అంతర్జాతీయ నౌకాదళాల సమీక్షను అద్భుతంగా నిర్వహించామన్నారు. జాతీయ ఎల్ఈడీ పథకం ద్వారా విద్యుత్ ఆదాకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. జాతీయ ఖనిజ నిధి ద్వారా పారదర్శకంగా గనులను అప్పగిస్తున్నామన్నారు.

పర్యాటక రంగం కోసం స్వదేశ్ దర్శన్ ద్వారా 13 సర్క్యూట్లను గుర్తించామన్నారు. విమానయాన రంగంలో కొత్త విధానం అమలు చేస్తున్నామన్నారు. దేశంలోని చిన్న నగరాలకు విమానయానాలు పెంచామని చెప్పారు. నయీమంజిల్ ద్వారా మదర్సాల్లో ఉచిత శిక్షణ అన్నారు. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. సముద్ర తీర ప్రాంతాల ద్వారా వాణిజ్య అభివృద్ధి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+