శశికళకు షాక్: 'నా సంతకాన్ని ఫోర్జరీ చేశారు, పన్నీర్ కే నా మద్దతు''
తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని పూత్తంగరై ఎంఏల్ఏ మనోరంజితం ఆరోపించారు. అన్నాడిఎంకె శాసనసభ్యుల సమావేశానికి తాను హజరుకాలేదని ఆమె చెప్పారు.తాను పన్నీర్ సెల్వానికే మద్దతిస్తున్నట్టు ఆమె చెప్పారు.
చెన్నై:తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని పూత్తంగరై ఎంఏల్ఏ మనోరంజితం ఆరోపించారు. అన్నాడిఎంకె శాసనసభ్యుల సమావేశానికి తాను హజరుకాలేదని ఆమె చెప్పారు.తాను పన్నీర్ సెల్వానికే మద్దతిస్తున్నట్టు ఆమె చెప్పారు.
అన్నాడిఎంకె శాసనసభ్యుల సమావేశానికి తాను హజరుకాకపోయినా కాని, శశికళ ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టేందుకుగాను తాను సంతకం పెట్టానని తెలుసుకొని దిగ్బ్రాంతికి గురైనట్టు చెప్పారు.

ఇప్పటివరకు తాను ఎలాంటి పత్రాలపై కూడ సంతకం చేయలేదన్నారు.తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఆమె ఆరోపించారు. ప్రజల ఆభీష్టం మేరకే తాను పన్నీర్ సెల్వానికి మద్దతు తెలుపుతున్నట్టు ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications