జై హింద్, జై శ్రీరాం కాదు : దీదీ సంచలనం
కోల్ కతా : టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తాను, తన పార్టీ వందేమాతరం అని అంటోందని .. విశ్వసిస్తోందని కుండబద్దలు కొట్టారు. తాము కలలో కూడా జై శ్రీరాం అనే మాటలను నమ్మబోమని తేల్చిచెప్పారు. బీజేపీ, ఆరెస్సెస్ హిందూత్వ ఎజెండగా రాముడు, హిందుత్వంతో ముందుకెళ్తుండగా .. టీఎంసీ జై శ్రీరాం అనబోనని మరోసారి స్పష్టంచేయడం పొలిటికల్ సర్కిల్లో చర్చకు దారితీసింది.

జై బంగ్లా
బెంగాల్‌లో బీజేపీ జై హిందు అని అంటే తాము జై బంగ్లా, జై హిందు అంటామని ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. మా స్లోగన్ వందేమాతరం, లేదంటే జై హింద్ ఉంటుంది తప్ప మరొటి ఉండదని ... జై శ్రీరాం బీజేపీ స్లోగన్ అని విమర్శించారు. అలాగే తాము హిందు-ముస్లింల పేరుతో రాజకీయాల చేయమని, చేయబోమని స్పష్టంచేశారు. దేశంలో ప్రతి కులం, మా కులమే, కానీ బీజేపీ కుల రాజకీయాల గురించి ... ప్రచారానికి వస్తోన్న మోదీని అడగండి అని ప్రజలను కోరారు మమత.
మాదే విజయం ..
బెంగాల్‌లో టీఎంసీ విజయంపై మమత ధీమాతో ఉన్నారు. తమకు మోదీ, బీజేపీతో ఎలాంటి ప్రమాదం ఉండబోదన్నారు. రాష్ట్రంలో కులమతాలకతీతంగా అందరూ టీఎంసీని సపోర్ట్ చేస్తున్నారని గుర్తుచేశారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాజయం తప్పదని జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల్లో మోదీ, మీరు వ్యక్తిగత విమర్శలు హద్దుమీరాయని మీడియా ప్రతినిధి ప్రశ్నిస్తే .. ఈ గొడవను రాజేసింది ఎవరూ అని ఎదురు ప్రశ్నించారు. అంతేకాదు మోదీ ఇక కాలం చెల్లిన బాబు అని మరోసారి గుర్తుచేశారు. మోదీకి తానే స్పీడ్ బ్రేకర్ వేస్తున్నట్టు ధీమాతో చెప్పారామె. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుందని కానీ మోదీ మాత్రం వ్యక్తిగత దూషణకు దిగారని పేర్కొన్నారు. అలాంటి సాంప్రదాయం తీసుకొచ్చినందునే ... మోదీపై ఎదురుదాడికి దిగాల్సి వచ్చిందని స్పష్టంచేశారు మమత.












Click it and Unblock the Notifications