నా కొడుకును కూడా విచారించండి: మోడీ ప్రభుత్వానికి యశ్వంత్
జీఎస్టీ విషయంలో మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా సొంత పార్టీ పైనే విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన పారడైజ్ పత్రాల లీక్ పైన స్పందించారు.
న్యూఢిల్లీ: జీఎస్టీ విషయంలో మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా సొంత పార్టీ పైనే విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన పారడైజ్ పత్రాల లీక్ పైన స్పందించారు.
పారడైజ్ పత్రాల్లో తన కుమారుడు, కేంద్రమంత్రి జయంత్ సిన్హా పేరు ఉండటంపై ప్రభుత్వం తప్పకుండా విచారణ జరపాల్సిందేనని డిమాండ్ చేశారు.

పారడైజ్ పత్రాల్లో ఏయే రాజకీయ నేతల పేర్లు బయటకు వచ్చాయో వారిందరిపైనా విచారణ జరపాలని, పదిహేను రోజుల్లో లేదా నెల రోజుల్లో వారిని విచారించాలన్నారు.
ఎవరినీ వదిలి పెట్టకుండా, తన కొడుకు జయంత్ సిన్హాతో పాటు జై షా కేసును కూడా విచారించాలని ఆయన అన్నారు.
బీజేపీ అధికారంలోకి వచ్చాక జైషా కంపెనీ ఆస్తులు 16వేల రెట్లు పెరిగాయని ఆరోపిస్తూ ది వైర్ అనే వెబ్‌సైట్‌లో ఇటీవల ఓ కథనం వచ్చింది. దీనిని సవాల్ చేస్తూ జై షా రూ.100కోట్ల పరువు నష్టం దావా వేశారు.












Click it and Unblock the Notifications