• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

క్యాన్సర్‌తో బాధపడుతున్న ఈ పసిప్రాణాన్ని కాపాడండి, సాయం చేయండి

|

అతను వృత్తిరీత్యా ఒక మంగలి. రోజూ పని చేస్తేగానీ పూటగడవని పరిస్థితి అతనిది. అలాంటి ఆయనకు దేవుడు పెద్ద పరీక్ష పెట్టాడు. దీనావస్థలో ఉన్న తన అల్లారుముద్దుల కొడుకు ప్రాణాన్ని కాపాడుకునేంత స్థోమత కూడా అతనికి లేదు. పెద్దగయ్యాక డాక్టర్ కావాలని కలలుగనే అతని కుమారుడు తుహిర్ పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉంది. ఇంటి దగ్గర డాక్టర్ గేమ్ ఆడుతూ అందర మనస్సులను దోచే తుహీర్ ఇప్పుడు హాస్పిటల్ బెడ్ కే పరిమితం అయ్యాడు. తుహిర్ ఏదో ఒక రోజు తెల్లకోటు వేసుకుని డాక్టర్ అవుతాడని ఆ ఇంట్లో వాళ్లు అనుకునేవారు. అతని కోరిక కూడా డాక్టర్ కావాలనే. కానీ ఆ ఆశలకు అడ్డుపడేలా అతని ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూ ఉంది. రాను రాను ఆ చిన్ని నవ్వుకి అంతరాయాలు ఏర్పడుతూనే ఉన్నాయి. ప్రతి సారీ వైద్యుని చూడగానే నా చీర చెంగు వెనక దాక్కుంటాడు. ఇంజెక్షన్లoటే అంత భయం వాడికి. క్యాన్సర్ తో బాధపడుతున్న తుహిర్ క్రమంగా బరువుని కోల్పోయి బక్కచిక్కిపోతున్నాడు. కనీసం నేను కూడా గుర్తించలేని స్థితికి చేరుకున్నాడు అంటే, మా కొడుకు ఎంతటి బాధ అనుభవిస్తున్నాడో మీరే అర్ధం చేసుకోవాలి"అంటూ అతని తల్లి కన్నీటి పర్యంతమైంది.

"తుహిర్ పేరుకి 8 ఏళ్ల కుర్రాడు అయినా, ఆలోచనల్లో అతని వయసుకన్నా మెదడు పెద్దదని చెప్పవచ్చు. చాలా చురుకైనవాడు. బాగా తెలివైన వాడు. పెద్ద పెద్ద పదాలను సైతం అవలీలగా పలుకగలడు. వయసుకు మించిన లెక్కలను చేయగలడు. అంత తెలివైన కొడుకు ఉంటే, ఎంత గర్వంగా ఉంటుంది చెప్పండి. తుహిర్ తెలివిని చూసి, అతను కోరుకునే విధంగానే ఏదో ఒకరోజు కచ్చితంగా వైద్యుడు అవుతాడని ఎంతో ఆశ పడ్డాం. ఆటల్లో కూడా డాక్టర్ డాక్టర్ అంటూ తిరుగుతూ ఉంటాడు తుహిర్. కానీ విధి ఆడే వింత నాటకంలో ఎవ్వరం ఏమీ చేయలేం. నా బిడ్డ జీవితంతో విధి ఇలా ఆడుకుంటుందని అనుకోలేదు." అని తుహీర్ తల్లి బాధపడింది.

My son is struggling with Cancer, please help

"పశ్చిమ బెంగాల్ లోని ఒక మారుమూల గ్రామంలో ఎంతో సంతోషంగా నివసించే మా జీవితం ఇలా తలకిందులవుతుందని అస్సలు ఊహించలేకపోయాము.

ఒక శనివారం నా కుమారుడు ఆడుకునే "డాక్టర్ కిట్" తీసుకుని ఇరుగుపొరుగు వారింటికి వెళ్లి ఆడుకుని వచ్చాడు. తర్వాత ఎటువంటి శబ్దం లేకుండా బుద్దిగా పడుకున్నాడు. అన్నం తినిపిస్తూ తుహిర్ పొట్టను గమనించాను. ఒక పక్కన వాచిపోయి కనిపించింది. నేను పెద్దగా చదువుకోలేదు.

My son is struggling with Cancer, please help

కానీ నా బిడ్డకు ఏదో అనారోగ్యంతో బాధపడుతున్నాడని మాత్రం అర్థమైంది. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా, సమీపంలోని వైద్యుని వద్దకు పరుగున తీసుకుని వెళ్లాం.

ఇద్దరు ముగ్గురు వైద్యులను కలిసినా, సరైన నిర్ధారణ చేయలేకపోయారు. క్రమంగా 4 విడతలు ఆసుపత్రికి వెళ్లి, 2ఎక్స్- రేలు కూడా తీయించాం.

My son is struggling with Cancer, please help

ఒక స్నేహితుని ఫామిలీ డాక్టర్ పర్యవేక్షించి, కడుపులో ఏదో అసాధారణ కణితి రూపంలో ఉందని, ఎంత వీలయితే అంత త్వరగా ఆసుపత్రిలో చేర్చడం మంచిదని సూచించాడు. కోల్కతాలో తుహీర్ చికిత్సకు ఎంపిక చేయదగ్గ ఆసుపత్రులు లేవని భావించినందున వైద్యుడు, చెన్నైకి తీసుకెళ్ళమని సూచించారు.

షాక్ నుంచి తేరుకునే సమయం కూడా మాకు లేదు.అనేక గందరగోళాల నడుమ చెన్నైకి ప్రయాణం ప్రారంభించాము. అప్పటిదాకా గ్రామ ప్రాంతాలకే పరిమితమైన మేము భవనాలను, కొత్త వ్యక్తులను చూస్తూ సంబంధం లేని కొత్త ప్రపంచంలోకి వచ్చాం.ఎంతైనా గ్రామీణ వాసులం కదా. జీవితమంతా గ్రామాల్లో గడిపిన మాలాంటి వ్యక్తులకు నగరాలు కొత్తగానే ఉంటాయి. మాకు గ్రామం దాటడం అంటే, కొత్త దేశానికి వెళ్లినట్లే లెక్క.పక్కనే ఉన్న కలకత్తాకి వెళ్లినా కూడా గొప్పగా చెప్పుకునే అల్ప సంతోషులం. అలాంటి మాకు చెన్నై లాంటి మహానగరం ఇంకెలా ఉంటుందో మీరే ఊహించవచ్చు. మందులకు, ప్రయాణాలకు సరిపడే డబ్బును స్నేహితులు, బందువులు ఊర్లో వాళ్ళు సమకూర్చారు. ఇక ఎటువంటి ఆధారమూ మాకు లేదు. దేవుడి మీద భారం వేశాం.ఏ ధైర్యంతో ఇంతటి మహానగరంలో అడుగు పెట్టామో మాకే తెలీదు. ఏం చేసైనా నా బిడ్డను బతికోవాలని ఆశతో జీవిస్తున్నాం.

My son is struggling with Cancer, please help

ఇక్కడ అడుగడుగూ తెలిసిన గ్రామం నుంచి అడుగు కూడా పడని నగరానికి వచ్చామ న్నది ఒక ప్రశ్న అయితే, బిడ్డను కాపాడుకోడానికి మాకు ఏ దారులూ కనపడకపోవడం మరొక ప్రశ్నగా మారింది. మనుషులు తెలీదు, చేతిలో చిల్లి గవ్వ లేదు. బిడ్డ చూస్తే శుష్కిoచుకుని పోతున్నాడు. కళ్లల్లో నీరు,మనసులో ఎక్కడో ఆశ... ఇవి తప్ప ఏముంది మా దగ్గర"అంటూ వారి దీనావస్థను పంచుకున్నాడు తుహీర్ తండ్రి.

"చెన్నైలో ఆసుపత్రిలో చేర్చుకోడానికి అనుమతించడం మూలంగా ఎటువంటి సమయం వృథా కాలేదు. ఎన్నో గంటలు ఎదురు చూశాక, అనేక పరీక్షల నిమిత్తం నా బిడ్డ విల్మ్స్ ట్యూమర్ సమస్యతో భాదపడుతున్నాడని తేల్చారు. ఇది అత్యంత అరుదైన వ్యాధి కావడం చేత, నిర్ధారణకు కూడా సమయం పట్టింది. క్రమంగా మా కుమారుని ఎడమ మూత్రపిండములో కణితి చేరిపోయిందని తేలింది. విల్మ్ కణితితో బాధపడుతున్న రోగులు అనేకమంది 5 సంవత్సరాల లోపు ఉండగా, తుహిర్ 8, 9 సంవత్సరాల వయసులో ఈ వ్యాధికి గురయ్యాడు. దీనికి కీమోథెరపీ మాత్రమే, ఏకైక మార్గంగా వైద్యులు సూచించారు. 6 నెలల కీమోథెరపీ తర్వాత, శస్త్రచికిత్స ద్వారా పూర్తిగా అతనిని బాగుచేయుటకు వీలవుతుందని తేల్చిచెప్పారు.

My son is struggling with Cancer, please help

వైద్యులు మా కుమారుడు, ఎడమ మూత్రపిండాల కణితితో బాధపడుతున్నాడని మాకు తెలిపారు, ఆ వార్త విన్న నా నోట మాట పడిపోయింది. అంత చిన్ని పసిబిడ్డ అంత బాధను ఎలా తట్టుకుంటాడో తలచుకుంటేనే గుండె బరువైపోతుంది. తన పరిస్థితికి చికిత్స ఉన్నదని వైద్యుడు మాకు చెప్పిన వెంటనే, ఏం చేసైనా బిడ్డను బతికించుకావాలన్న ఆలోచనతో ముందుకు అడుగులు వేశాo. ఈ కొత్త నగరంలో అతని వైద్య ఖర్చులను భరించేందుకు, రోజులో ఒక పూట మాత్రమే తింటున్నాము. ప్రతి ఒక్క రూపాయిలోనూ మా బిడ్డ ప్రాణం చూసుకుంటూ పొదుపుగా ఖర్చు పెట్టుకుంటూ, చికిత్సకు ఖర్చు చేస్తున్నాము.

తుహీర్ సోదరి పెరిగిన కడుపును చూసి, లోపలికి నొక్కుతూ తగ్గించాలన్న ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ సమస్య మాకే పూర్తిగా అర్ధం కాని పరిస్థితి, అలాంటిది ఆ పసిబిడ్డకు ఏం తెలుస్తుంది వాడి బాధ. ఒకవేళ మాకు తెలిసి చెప్పినా, అర్ధం చేసుకోలేని పసివయసు తనది. కానీ, మా కళ్ళల్లో నీళ్ళు తుడవడానికి తెలిసీ తెలియని ఆ చిన్నిచేతులే ముందు ఉంటున్నాయి అన్ని వేళలా.." అంటూ ఆవేదన చెందాడు తుహీర్ తండ్రి.

తుహిర్ తండ్రి గ్రామంలో ఒక మంగలి.అతని నెల సంపాదన కేవలం 3,000 రూపాయలు. ఇప్పటి వరకు వారి ప్రయాణ, వైద్య ఖర్చులతో వారి వద్దనున్న డబ్బు మొత్తం హరించుకుని పోయింది. ఇలా క్రమంగా మొత్తం రూ .50,000 ఖర్చు అయింది. ఇప్పటికే బంధువుల నుంచి, స్నేహితుల నుంచి డబ్బును అరువు తీసుకున్నారు.

ఈ క్రింది లింక్ క్లిక్ చేసి సహాయం చేయండి.

My son is struggling with Cancer, please help

మరి సహాయం ఎలా?

తుహీర్ పరిస్థితి, తన తల్లిదండ్రులను సొంత ఇంటిని విడిచిపెట్టి చెన్నైకి చేరుకునేలా ఒత్తిడి తెచ్చింది. అతని అనారోగ్యానికి చికిత్స చేయటానికి 1800 కిలోమీటర్లు దాటి, చెన్నై అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. వ్యాధి కారణంగా అతని కడుపు పరిమాణం క్రమంగా రెట్టింపుకు చేరుకుంది. అతని తల్లిదండ్రులు తాము చేయగల అన్నీ ప్రయత్నాలూ చేస్తూనే ఉన్నారు. వారి ఒకే ఒక్క కుమారుణ్ణి కాపాడే క్రమంలో అన్నింటినీ పోగొట్టుకున్న తరువాత, వారు crowdfunding ను ఆశ్రయించారు. మీరు సహాయం చేసే ప్రతి రూపాయి వారి ఏకైక కుమారుడి ప్రాణాన్ని నిలబెట్టేందుకు సహాయం చేయగలదు.దయచేసి వాట్సాప్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాలలోమీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో వారి దురావస్థను షేర్ చేయండి. తుహిర్ ప్రాణాన్ని నిలబెట్టితాను వైద్యుడు కావాలన్న కలను నెరవేరేందుకు తోడ్పాటును అందివ్వగలరు. ఇక్కడ పొందుపరచిన లింక్ ద్వారా కూడా మీ వంతు సహాయం మీరు అందివ్వగలరు. మీరు చేసే ప్రతి రూపాయి సహాయం, ఏదో ఒక రీతిన వారికి సహాయపడగలదు. కనికరించండి.

English summary
Help this family who's son is struggling with cancer. You can help with clicking this.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more