నా భార్యకు పురుషాంగం ఉంది, స్త్రీ కాదు; విడాకుల కోసం సుప్రీంకోర్టులో భర్త షాకింగ్ పిటీషన్
సొంత భార్య పైన సుప్రీం కోర్టులో పిటిషన్ వేశాడు ఓ భర్త. భర్త భార్య పై దాఖలు చేసిన పిటిషన్ విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా ఒక్క సారిగా షాక్ కు గురయింది. అయినా తప్పని సరి పరిస్థితుల్లో ఆ కేసుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టాల్సి వచ్చింది. ఇక ఇంతకీ ఆ కేస్ ఏంటంటే

మోసం చేసిందని .. భార్యపై కోర్టుకెళ్ళిన భర్త
గ్వాలియర్ కు చెందిన వ్యక్తి తన భార్య పైన, భార్య తండ్రి పైన సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వారు తనను మోసం చేశారని, తన భార్య స్త్రీ కాదని, పురుషుడు మాదిరిగా అంగం ఉందని మెడికల్ రిపోర్టు ప్రకారం తేలిందని, తాను మోసపోయానని భావిస్తున్న కారణంగా విడాకులు ఇప్పించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.

భార్యకు పురుషాంగం ఉన్నట్టు గుర్తించిన భర్త షాక్
ఇక ఈ కేసు వివరాల్లోకి వెళితే 2016లో సదరు వ్యక్తి పెళ్లి జరుగగా, భర్తని చాలా రోజుల పాటు భార్య దగ్గరకు రాకుండా అడ్డుకుంది. ఆ తర్వాత భర్త బలవంతం మేరకు శృంగారానికి ఒప్పుకుంది సదరు మహిళ. అయితే శృంగార సమయంలో భర్త ఆమె జననేంద్రియాలను చూసి ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఆమెకు మగవారికి తరహాలో పురుషాంగం ఉందని గుర్తించాడు. ఆపై భార్యను మెడికల్ చెకప్ కి తీసుకువెళ్ళాడు. దీంతో భార్య కు Congenital adrenal hyperplasia అనే సమస్య ఉందని వైద్యులు నిర్ధారించారు.

సర్జరీ ద్వారా తొలగించవచ్చు అని వైద్యుల సలహా.. ట్విస్ట్ ఏంటంటే
అంటే మగవాళ్ళ అంగం లాంటి అవయవం ఆమె జననేంద్రియాల వద్ద పెరిగినట్లుగా వైద్యులు తెలిపారు. వైద్యులు ఆ వ్యక్తికి తన భార్య పరిస్థితిని శస్త్రచికిత్స ద్వారా సరి చేయవచ్చని తెలిపారు. అయితే గర్భం దాల్చే అవకాశాలు దాదాపు అసాధ్యమని డాక్టర్ చెప్పారు. దీంతో తనను మోసం చేశారని సదరు వ్యక్తి భార్యను పుట్టింటికి పంపించాడు. అసలు విషయం చెప్పకుండా తనను మోసం చేసి పెళ్లి చేశారని మండిపడ్డారు. అప్పటినుండి ఇరు కుటుంబాల మధ్య గొడవలు కొనసాగుతున్నాయి. మహిళ తండ్రి తన కూతుర్ని భర్త వేధిస్తున్నాడంటూ అతనిపై ఫిర్యాదు చేయగా ఎఫ్ఐఆర్ నమోదైంది.

ఇరు కుటుంబాల మధ్య గొడవలు, కోర్టు మెట్లెక్కిన దంపతులు
దీంతో తన మెడికల్ కండిషన్ గురించి చెప్పకుండా దాచి పెట్టి భార్య, మామ ఇద్దరు తనను మోసం చేశారని వారిద్దరిపై సదరు వ్యక్తి సెక్షన్ 420కింద చీటింగ్ కేసు నమోదు చేశాడు. ఇక ఈ కేసు పై ట్రయల్ కోర్టులో అనేకమార్లు విచారణ జరిగింది. మహిళ మధ్యప్రదేశ్ హైకోర్టుకు కూడా వెళ్లిన క్రమంలో మధ్యప్రదేశ్ హైకోర్టు మహిళకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆమెకు పురుషులకు ఉండే అంగం వంటి అవయవం తోపాటు స్త్రీలకు ఉండే జననేంద్రియాలు కూడా ఉండడం వల్ల ఆ మహిళ తప్పేమీ లేదని కోర్టు పేర్కొంది.
Recommended Video

సుప్రీం కోర్టులో భర్త పిటీషన్ .. మెడికల్ హిస్టరీపై మహిళకు నోటీసులు
గతేడాది జూలై 29న మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆమె భర్త సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ కు సమాధానం ఇవ్వాలని న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, ఎంఎం సుందరేష్ ఆ మహిళను కోరారు. మహిళ యొక్క మెడికల్ హిస్టరీలో పురుషాంగంతో పాటు అసంపూర్తిగా ఉన్న జననాంగాలు ఉన్నాయి కాబట్టి ఆమె ఆడది కాదని భర్త పిటీషన్ లో పేర్కొన్న కారణంగా నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆమెకు నోటీసు జారీ చేసింది. మరి ఈ వ్యవహారంలో విచారణ జరుపుతున్న సుప్రీం ధర్మాసనం ఎలాంటి తీర్పు నిస్తుంది అన్నది తెలియాల్సి ఉంది.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications