భార్యకు ఉగ్రవాది ముద్రవేసిన ఘనుడు.. ఏకంగా ఎయిర్‌పోర్ట్ సిబ్బందికే ఫోన్ చేసి... ఎందుకంటే..

న్యూఢిల్లీ : వాళ్లిద్దరూ ప్రేమించారు.. పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. కానీ అతని భార్య విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమైంది. భర్తను వదిలి ఉద్యోగం కోసం వెళ్తానంటే వద్దన్నాడు. బ్రతిమిలాడిన ప్రయోజనం లేకపోయింది. భార్య తన వద్ద ఉండేందుకు మాస్టర్ ప్లాన్ వేశాడు. కానీ పోలీసులకు చిక్కి ఊచలు లెక్కబెడుతున్నాడు. దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.

దేశ రాజధాని ఢిల్లీలో నసీరుద్దీన్ బ్యాగుల తయారీ ఫ్యాక్టరీ నడుపుతున్నాడు. తన వద్ద పని చేసే రఫియాను పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరూ బాగానే ఉన్నారు. కానీ రఫియాకు గల్ఫ్‌లో ఉద్యోగం చేయాలనుకొంది. ఈ విషయం భర్తకు చెప్పింది. అందుకు భర్త నసీరుద్దీన్ అంగీకరించలేదు. తనతో ఉండాలని స్పష్టంచేశాడు. ఈ విషయంపై భార్య భర్తల మధ్య గొడవ కూడా జరిగింది. కానీ రఫియా మాత్రం ఇండియాలో ఉండేందుకు అంగీకరించలేదు. దీంతో ఆమెను ఆపేందుకు చేసినా ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరికి ఓ మాస్టర్ ఫ్లాన్ వేశాడు.

my wife is terrorist .. she blast airport says naseer to staff

ఈ నెల 8న రఫియా ఇంటినుంచి ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు బయల్దేరింది. అయితే నసిరుద్దీన్ ఎయిర్‌పోర్టుకు సిబ్బందికి ఫోన్ చేశారు. రఫియా అనే ప్యాసెంజర్ ఉగ్రవాది అని .. ఎయిర్‌పోర్టులో బాంబు పెట్టిందని చెప్పారు. దీంతో ఎయిర్ పోర్టు సిబ్బంది అలర్టయ్యారు. వెంటనే విమానాన్ని ఆపివేసి నిశీతంగా తనిఖీ చేశారు. కానీ ఎలాంటి బాంబు లభించలేదు. దీంతో ఫోన్ చేసింది ఎవరూ అని ఆరాతీశారు. అటు నుంచి విచారణ చేస్తే దిమ్మతిరిగే నిజం వెలుగుచూసింది. తన భార్యను ఆపేందుకు నసీరుద్దీన్ ఈ విధంగా ప్లాన్ చేశాడని తెలిసింది. దీంతో అతనిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. తన భార్య తన నుంచి వెళ్లొద్దని నసిరుద్దీన్ వేసిన ప్లాన్ బెడిసికొట్టింది. చివరికి జైలులో ఊచలు లెక్కబెడుతున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+