పార్లమెంట్ లో దాడి, బీజేపీ ఎంపీ సింహా ఇప్పుడు కాంగ్రెస్ కు టార్గెట్, మైసూరులో ఇది జరిగింది !
పార్లమెంట్‌లో దుండగులు చొరవడటం కలకలం రేపింది. కర్ణాటకలోని మైసూరు నగరానికి చెందిన మనోరంజన్ ప్రధాన పాత్రధారి అని పోలీసులు అంటున్నారు. పార్లమెంటు లోపలికి వెళ్లేందుకు మైసూరు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా మనోరంజన్ కు విజిటర్ పాస్ ఇచ్చారని వెలుగు చూడటం కలకలం రేపింది. ఇప్పుడు ఈ అంశం కాంగ్రెస్‌కు పెద్ద అస్త్రం అయ్యింది. ఇంతకీ ఈ మనోరంజన్ ఎవరు?, బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహాకు అతనికి ఎలా పరిచయం అయ్యింది అని ఆరా తీస్తున్నారు.
దుండగులు పార్లమెంటులోకి ప్రవేశించి రచ్చ సృష్టించారు. నిరుద్యోగ సమస్యను ఎత్తిచూపేందుకు నిందితులు ఈ చర్యకు పాల్పడ్డారా ? అని సామాన్య ప్రజలు చర్చించుకుంటున్నారు. పోలీసులకు చిక్కిన నిందితులకు ఒకరికొకరు సంబంధం లేదు, ఎవరు కలిసి చదువుకోలేదు, కనీసం కలిసి తినలేదు, కలిసి పెరగలేదని వెలుగు చూసింది. కేవలం సోషల్ మీడియాలో అందరూ ఒకరికొకరు పరిచయం చేసుకున్నారు. దేశంలో చాలా ఉద్యోగాలు ఉన్నా వీళ్లకు మాత్రం చదువుకు తగ్గ ఉద్యోగం దొరకలేదని సమాచారం.

నిరుద్యోగం విజృంభిస్తున్నందున వారు పార్లమెంటుపై కలర్ బాంబులతో దాడికి పట్టుబడ్డారు. పట్టుబడిన వారిలో మైసూరులోని విజయనగర్ కు చెందిన మనోరంజన్ ఒకడు. లోక్‌సభలో ఇబ్బంది పెట్టాలని మనోరంజన్ ముందే ప్లాన్ చేసుకున్నాడని వెలుగు చూసింది. మైసూర్- కొడగు లోక్ సభ నియోజక వర్గం బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా నుంచి పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు పాస్ కూడా మనోరంజన్ సంపాధించాడని వెలుగు చూసింది.
బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా నుంచి పాస్ లు తీసుకున్న : ఇద్దరు వ్యక్తులు లోక్‌సభ గ్యాలరీ నుంచి దూకారు. వారు తోపులాటలు చేసి దాడి చెయ్యడానికి ప్రయత్నించినప్పటికీ ఇద్దరిని వెంటనే ఎంపీలు, సెక్యూరిటీ సిబ్బంంది పట్టుకున్నారు. పాస్‌లో ఒకరి పేరు సాగర్ శర్మా, మైసూరు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా నుంచి మరొకరికి పాస్ వచ్చిందని ఎంపీ డానిష్ అలీ అన్నారు. మైసూర్ కొడగు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా నుంచి లోక్‌సభ సమావేశాన్ని చూసేందుకు మనోరంజన్ విజిటర్ పాస్ పొందారు.
అదేవిధంగా ఎంపీ ప్రతాప్ సింహా శిఫారస్సు లేఖపై సాగర్, మనోరంజన్ అనే ఇద్దరు వ్యక్తులను లోక్ సభ గ్యాలరీకి వెళ్లేందుకు అనుమతించారు. ఎంపీ ప్రతాప్ సింహా లేఖ ఆధారంగా మనోరంజన్, సాగర్ శర్మాలకు పార్లమెంట్ సిబ్బంది పాస్ ఇచ్చారు.పార్లమెంట్ హౌస్ లోపలా కలకలం రేపిన సాగర్ శర్మా, మనోరంజన్ ల గురించి ఢిల్లీ పోలీసులు మైసూరు పోలీసులకు సమాచారం ఇచ్చిన సంగతి తెలిసిందే.మైసూర్ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ గజేంద్ర ప్రసాద్ మనరోంజన్ ఇంటికి వెళ్లి సోదాలు చేశారు.

అప్పుడు కొన్ని విప్లవకారుల పుస్తకాలు దొరికాయని తెలిసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మనోరంజన్ మొబైల్ ఫోన్ ఉపయోగించలేదని అతని తండ్రి దేవరాజే గౌడ మీడియాకు చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. మనోరంజన్‌కి పాస్ ఇప్పించిన ఎంపీ ప్రతాప్ సింహా ఇప్పుడు కాంగ్రెస్‌కు ఎరచేప అయ్యారు.మైసూరులోని ప్రతాప్ సింహా కార్యాలయం ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనకు దిగారు.
మరోవైపు సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహాపై ఆరోపణల దాడికి దిగారు. అలాగే పార్లమెంటులోకి చొరబడిన నిందతులు ప్రతాప్ సింహా నుంచి పాస్ పొందారని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ దాడి చేసినవారు ప్రతాప్‌సింహాకు సన్నిహితులని, ఈ దాడికి ప్రతాప్ సింహాకు కూడా కుట్ర చేశారా ? అంటూ కాంగ్రెస్ నాయకులు నిలదీస్తున్నారు.












Click it and Unblock the Notifications