సీఎం తీరుపై మండిపడిన రాజవంశస్తులు, న్యాయపోరాటం చేస్తాము
మైసూరు రాజవంశస్తుడు, బీజేపీ ఎంపీ యదువీర కృష్ణదత్త చామరాజ వడయార్ కర్ణాటక సీఎం సిద్దరామయ్య తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మైసూరు రాజవంశస్తుడు అయిన యదువీర్ మాట్లాడుతూ చాముండిబెట్ట డెవలప్‌మెంట్ అథారిటీ అంశంపై కోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య నేతృత్వంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు.
మైసూరులో విలేకరులతో బీజేపీ ఎంపీ యదువీర్ మాట్లాడుతూ చాముండిబెట్ట డెవలప్‌మెంట్ అథారిటీ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. అథారిటీ ఛైర్మన్‌గా ఉన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీసుకున్న నిర్ణయంపై తనకు అభ్యంతరాలు ఉన్నాయని, సీఎం నిర్ణయం చెల్లదని, తాను న్యాయ పోరాటం కొనసాగిస్తానని బీజేపీ ఎంపీ యదువీర్ అంటున్నారు.

మైసూరు-కొడుగు లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యాలని బీజేపీ నాయకులు మైసూరు రాజవంశస్తుడైన యదువీర కృష్ణదత్త చామరాజ వడయార్ లోక్ సభ ఎన్నికలకు ముందే మనవి చేశారు. అప్పటి బీజేపీ సిట్టింగ్ ఎంపీ ప్రతాప్ సింహాను పక్కన పెట్టిన బీజేపీ హైకమాండ్ యదువీర్ ను లోక్ సభ ఎన్నికల్లో పోటీలో దింపారు. సీఎం సిద్దరామయ్యతో పాటు అప్పటి బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా వర్గంలోని కొందరు మైసూరు రాజవంశస్తుడు యదువీర్ ను ఓడించడానికి అనేక ప్రయత్నాలు చేశారు.

అయితే మైసూరు కొడుగు జిల్లాల ప్రజలు మైసూరు రాజవంశస్తుడు యదువీర్ ను ఆదరించి ఆయన్ను ఎంపీగా గెలిపించారు. ముడా స్కామ్ లో చిక్కుకున్న సీఎం సిద్దరామయ్య ఇప్పుడు మైసూరు జిల్లాలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మైసూరు ఎంపీగా యదువీర్ విజయం సాధించడంతో సొంత జిల్లాలో పరువు పోయిందని రగిలిపోతున్న సిద్దరామయ్య చాముండిబెట్ట డెవలప్ మెంట్ అథారిటీ విషయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని బీజేపీ నాయకులు మండిపడుతున్నారు.
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications