తనకంటే వయసులో పెద్దదైన మహిళతో భర్త జల్సాలు, నవవధువు ఆత్మహత్య !

Posted By:
Subscribe to Oneindia Telugu

మైసూరు: వివాహం జరిగి సంవత్సరం పూర్తి కాకుండానే భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని ఇంటికి ఎప్పుడు వచ్చి వెలుతున్నాడో అర్థం కాకపోవడంతో జీవితంపై విరక్తి పెంచుకున్న నవవధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన మైసూరు నగరంలో జరిగింది.

మైసూరులోని టీకే లేఔట్ లో బసవరాజ్ కైవల్య, లేఖన (25) దంపతులు నివాసం ఉంటున్నారు. బసవరాజ్, లేఖన పెళ్లి జరిగి సంవత్సరం కూడా పూర్తి కాలేదు. బసవరాజ్ తనకంటే వయసులో పెద్దదైన ఓ మహిళతో అక్రమ సబంధం పెట్టుకున్నాడు.

Mysuru woman commits suicide due to husbands extra marital

భర్త అక్రమ సంబంధం గురించి లేఖనకు తెలిసింది. వేరే మహిళతో ఎందుకు అక్రమ సంబంధం పెట్టుకున్నావని భర్తతో గొడవపడింది. ఇదే విషయంలో నిత్యం దంపతుల మధ్య గొడవ జరుగుతోంది. అంతే కాకుండా వరకట్నం కోసం బసవరాజ్ కుటుంబ సభ్యులు లేఖను వేధించారని ఆరోపణలు ఉన్నాయి.

తన భర్త మీద లేఖన మైసూరులోని నజరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు బసవరాజ్, లేఖన దంపతులను పిలిచింని మాట్లాడారు. బసవరాజ్ మాత్రం తన పద్దతి మార్చుకోలేదు. తన భర్త మారలేదని జీవితంపై విరక్తి పెంచుకున్న లేఖన ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బసవరాజ్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Frustrated with husband's extra-marital relations, a A 25-year-old woman Lekhana committed suicide in Mysuru. Case registered in Saraswathipuram police station.
Please Wait while comments are loading...