మోడీకి 2 ఏళ్లు: కీలక నిర్ణయాల వెనుక ఉన్నది ఎవరు?

న్యూఢిల్లీ: కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్టీఏ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆయన పాలనపై ఓ సర్వే కూడా నిర్వహించారు. ఈ సర్వేలో మోడీ పాలన పట్ల ఎక్కువ మంది సంతృప్తి కరంగా ఉన్నట్లు తేలింది. మోడీ ప్రధానిగా ఉండటం, ఆయన పాలనపై దేశంలోని మూడింట రెండొంతుల మంది ప్రజలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

అయితే తన పాలనను సమర్ధవంతంగా నిర్వహించడానికి, ఆయన తీసుకునే కీలక నిర్ణయాల వెనుక ఉన్నది ఎవరు? బీజేపీకి, మంత్రివర్గానికి సంబంధం లేకుండా ప్రభుత్వాన్ని నడిపించడానికి ఆయనకు అండగా నిలిచింది ఎవరు? ప్రధాన మంత్రి కార్యాలయంలో అసలు మోడీ ఎవరిని నమ్ముతారు?

ఇలాంటి ప్రశ్నలన్నింటికీ ఒక్కటే సమాధానం గుజరాత్ కేడర్‌‌కు చెందిన ఐఏఎస్ అధికారులు. పీఎంఓతో పాటు కేంద్రంలోని పలు కీలక శాఖల్లో గుజరాత కేడర్‌ అధికారులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. అన్నింటా తామై పాలనలో మోడీకి సహకరిస్తున్నారు. అంతేకాదు ఇతర రాష్ట్రా‌లకు చెంది తనకు సన్నిహితులుగా పేరున్న అధికారులను మోడీ పీఎంఓలో నియమించుకున్నారు.

మనదేశంలో ప్రభుత్వాన్ని నడిపించడంలో ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) కీలకంగా పనిచేస్తోన్న సంగతి మనందరికీ తెలిసిందే. అటువంటి పీఎంఓలో మోడీ తనకు అత్యంత విశ్వసనీయులైన అధికారులను నియమించుకున్నారు. వీరిలో ఎక్కువ మంది గుజరాత్ కేడర్‌కు చెందిన అధికారులే కావడం గమనార్హం.

ఇక ప్రధాని మోడీకి అత్యంత విశ్వసనీయమైన వ్యక్తిగా గుర్తింపు పొందిన మాత్రం రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి పి.కె.మిశ్రా. ప్రస్తుతం ఈయన ప్రధాని అదనపు ప్రిన్సిపల్‌ సెక్రటరీగా పని చేస్తున్నారు. ఈయన 1972 బ్యాచ్‌ గుజరాత కేడర్‌ అధికారి. మోడీ గుజరాత సీఎంగా ఉన్నప్పుడు 2004 నుంచి 2008 వరకు సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీగా వ్యవహరించి రిటైరయ్యారు.

రిటైర్ అయిన తర్వాత ఆయనకు గుజరాత్ ప్రభుత్వంలో ఉన్నత పదవిని ఇచ్చారు. ఆ తర్వాత 2014లో ఎన్నికలు జరగడం, ఆ తర్వాత మోడీ ప్రధాని కావడం చకా చకా జరిగిపోయాయి. దీంతో ఆయన్ను పీఎంఓకు తీసుకొచ్చారు. కేంద్రంలో వివిధ శాఖలకు సంబంధించిన కీలక ఫైళ్లు, నియామకాలకు మిశ్రా ఆమోదముద్ర తప్పనిసరిగా ఉండాల్సిందే.

Myth that most IAS officers in Narendra Modi govt from Gujarat

అంతేకాదు అత్యంత కీలక అంశాలతో పాటు దేశానికి సంబంధించిన రహస్య నిర్ణయాల్లో కూడా పి.కె.మిశ్రాకు స్థానం ఉంది. దీనినే బట్టే ఆయన మోడీకి ఎంత సన్నిహితుడో అర్థం చేసుకోవచ్చు. నిజానికి పీఎంఓలో అత్యున్నత పోస్టు ప్రిన్సిపల్‌ సెక్రటరీ. ప్రధానికి అత్యంత దగ్గరగా ఉండే పోస్టు. సహజంగా పీఎంఓలో అన్ని విషయాల్లోనూ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జోక్యం ఉంటుంది.

నిజానికి ఇప్పుడు ప్రిన్సిపల్‌ సెక్రటరీగా ఉన్న నృపేంద్ర మిశ్రాని మోడీ కోరుకోలేదని సమాచారం. సీనియారిటీ ప్రకారం ఆయనకు ఆ పదవి వచ్చింది కాబట్టి.. పీఎంఓలో నృపేంద్ర మిశ్రా కంటే పి.కె.మిశ్రాకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని స్పష్టమవుతోంది. మరోవైపు ఉత్తర ప్రదేశ్‌ కేడర్‌కు చెందిన నృపేంద్ర మిశ్రా బీజేపీ అధ్యక్షుడు అమిత షాకు సన్నిహితుడనే ప్రచారం కూడా ఉంది.

ప్రధాని మోడీకి విశ్వసనీయంగా ఉండే మరో అధికారి రాజీవ్‌ టోప్నో. ఈయన సొంత రాష్ట్రం జార్ఖండ్‌. 1974 బ్యాచ్‌ గుజరాత్ కేడర్‌కు చెందిన టోప్నో.. మోడీ గుజరాత సీఎం అయినప్పటి నుంచి 2009 వరకు సీఎంవోలో వివిధ బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం డిప్యుటేషన్‌ మీద అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కార్యాలయంలో డిప్యూటీ కార్యదర్శిగా విధులు నిర్వహించారు.

మోడీ ప్రధాని అయ్యాక టోప్నోను తన అంతరంగిక కార్యదర్శిగా నియమించుకున్నారు. ఇక జాతీయ భద్రత సలహాదారుగా ఐపీఎస్‌ అధికారి అజిత ధోవల్‌ను మోడీ నియమించారు. దేశ భద్రతకు సంబంధించి అన్ని అధికారాలూ ఆయనకు కట్టబెట్టారు. కేంద్రంలో పాలనకు సంబంధించి అన్ని ప్రధాన శాఖల్లో మోడీ మంత్రుల కంటే కూడా అధికారులపైనే ఎక్కువ ఆధారపడుతుంటారు.

అంతేకాదు తనను తప్పుదోవ పట్టించని నమ్మకస్తులైన అధికారులనే మోడీ పీఎంఓలో నియమించుకున్నారు. వారినే ఏరికోరి మరీ కీలక శాఖల్లో కార్యదర్శులుగా నియమించారు. అందుకే మోడీ ప్రధాని అయిన తర్వాత భారత్‌లో కొంత మేర అవినీతి తగ్గిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+