నాగాలాండ్‌లో దారుణం:అంతరించిపోతోన్న ఆ పక్షిని కసితీర కొట్టి చంపారు
అంతరించిపోతున్న పశుపక్ష్యాదులను కాపాడుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకొచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోతోంది. భవిష్యత్ తరాలకు మచ్చుకైనా చూపించేందుకు ఈ పశుపక్ష్యాదులు ఇక ఉండవేమో అనిపించేలా మనిషి వీటిని మాయం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే పులులు, పలు జాతులకు చెందిన ఏనుగులు,పలు పక్షులు అంతరించిపోయే అవకాశం ఉందని జంతుప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈశాన్య భారతంలోని నాగాలాండ్ రాష్ట్రంలో ఓ ఘటన చోటుచేసుకుంది. అరుదైన ఓ పక్షిని కొట్టి చంపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఈశాన్య భారతం కొండకోనలకు, దట్టమైన అడవులకు ప్రసిద్ధి చెందింది. అక్కడి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇందుకోసమే అక్కడ పశుపక్ష్యాదులు ఎక్కువగా కనిపిస్తాయి. దేశం మొత్తం మీద కనిపించని కొన్ని పక్షులు ఈశాన్య రాష్ట్రాల్లో మనకు దర్శనమిస్తాయి. అక్కడికి వెళ్లిన పర్యాటకులను తమ కిలకిలరావాలతో పలకరిస్తాయి. కొన్ని పక్షులు చూసేందుకు ఎంతో ముద్దుగా ముచ్చటగా కనిపిస్తాయి.ఇక కొన్ని జాతి పక్షులు అంతరించిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. అలాంటి అరుదైన పక్షులను కాపాడుకోవాల్సింది పోయి వాటిని చిత్రహింసలకు గురిచేసి చంపేసిన ఘటన నాగాలాండ్‌లో వెలుగు చూసింది.

నాగాలాండ్‌లోని ఓఖా జిల్లాలో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. అంతరించిపోతోన్న అరుదైన హార్న్‌బిల్ పక్షిని కర్రతో కొందరు హింసించారు. ఈ ఘటనను పక్కన ఉన్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో కాస్త ఈ వీడియో వైరల్ అవడంతో జంతుప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగాలాండ్ అటవీశాఖ మరియు వైల్డ్‌లైఫ్ శాఖకు చెందిన కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పక్షిని చిత్రహింసలు పెట్టి చంపిన ముగ్గురుని అరెస్టు చేశారు. అయితే నిందితులకు సంబంధించి ఎలాంటి సమాచారంను పోలీసులు బయటపెట్టలేదు.
ఇదిలా ఉంటే గ్రేట్ ఇండియన్ హార్న్‌బిల్ పక్షులు నాగాలాండ్‌లో ఉంటాయి. ఈ పక్షిని అంతరించిపోతున్న పక్షుల జాబితాలో చేర్చింది ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్స్ (IUCN) సంస్థ.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications