కావేరీ గొడవ: నాన్ తమిళ్ కట్చి యువకుడు బలి
చెన్నై: బెంగళూరు నగరంలో తమిళులపై దాడులు చెయ్యడాన్ని ఖండిస్తూ, కావేరీ నీరు తమిళనాడుకు విడుదల చెయ్యాలని డిమాండ్ చేస్తూ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న యువకుడు విఘ్నేష్ మరణించాడు.

తీవ్రగాయాలై మృత్యువుతో పోరాడిన ఆ యువకుడు శుక్రవారం చికిత్స విఫలమై ప్రాణాలు విడిచిపెట్టాడు. నటుడు, రాజకీయ నాయకుడు సిమాన్ స్థాపించిన నాన్ తమిళ్ కట్చి పార్టీ కార్యకర్త అయిన విఘ్నేష్ తంజావూర్ సమీపంలోని గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించాడు.

చెన్నైలో జరిగిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న అతను ప్రాణాలైన అర్పిస్తాం కాని తమిళులపై దాడులు సహించమని నినాదాలు చేస్తూ ఒంటిమీద పెట్రోల్ పోలీసుకుని నిప్పంటించుకున్నాడు.

విఘ్నేష్ కు మెరుగైన చికిత్స అందించినా అతను మృతి చెందాడని నాన్ తమిళ్ కట్చి పార్టీ నాయకులు అంటున్నారు. విఘ్నేష్ మృతికి పలు రాజకీయ పార్టీల నాయకులు, తమిళ సంఘాల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. విఘ్నేష్ కుటుంబ సభ్యులను ఆదుకుంటామని వారు హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications