జయప్రద, నగ్మా, గుల్‌పనాగ్ భవిష్యత్తుపై నేడే!(పిక్చర్స్)
న్యూఢిల్లీ: మూడో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది. పదకొండు రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలింగ్ జరుగుతోంది.
91 లోకసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మీరా కుమార్, కమల్‌నాథ్, శశిథరూర్ థరూర్ లాంటి దిగ్గజాలు భవితవ్యం ఈ పోలింగ్‌లో తేలనుంది.
అలాగే ప్రముఖ సినీ నటులు జయప్రద, నగ్మా, మాజీ ఆర్మీ జనరల్ వికె సింగ్ తదితరుల నియోజకవర్గాల్లోను గురువారమే ఎన్నికల పోలింగ్ జరుగుతోంది.

షీలా దీక్షిత్ తనయుడు
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కేరళ ప్రస్తుత గవర్నర్ షీలా దీక్షిత్ తనయుడు సందీప్ దీక్షిత్ దేశ రాజధాని ఢిల్లీలో లోకసభకు పోటీ చేస్తున్నారు.

కపిల్ సిబాల్
కేంద్రమంత్రి కపిల్ సిబాల్ కాంగ్రెసు పార్టీ తరఫున చాందినీ చౌక్ నియోజకవర్గం నుండి బరిలోకి దిగుతున్నారు. ఆయన తన గెలుపుపై ధీమాతో ఉన్నారు.

రాజ్ బబ్బర్
ప్రముఖ సినీ నటుడు, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత రాజ్ బబ్బర్ ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాదు నుండి లోకసభకు పోటీ చేస్తున్నారు.

జయప్రద
ప్రముఖ నటి జయప్రద రాష్ట్రీయ లోకదళ్ పార్టీ తరఫున ఉత్తర ప్రదేశ్‌లోని బిజ్నోర్ నుండి లోకసభకు పోటీ చేస్తున్నారు. ఆమె గతంలో రాంపూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచారు.

నగ్మా
ప్రముఖ నటి నగ్మా కాంగ్రెసు పార్టీ తరఫున ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్ నియోజకవర్గం నుండి బరిలో నిలిచారు. ఆమెకు ప్రచారం చేసిన సమయంలో కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి.

మీరా కుమార్
లోకసభ స్పీకర్ మీరా కుమార్ బీహార్ రాష్ట్రం నుండి లోకసభకు పోటీ చేస్తున్నారు. ఆమె పైన తెలుగు వాడు అయిన అధికారి జెడి(యు) అభ్యర్థిగా నిలబడ్డారు.

రామ్ విలాస్ పాశ్వాన్ తనయుడు
రామ్ విలాస్ పాశ్వాన్ తనయుడు చిరాక్ పాశ్వాన్ బీహార్ రాష్ట్రంలో లోకసభకు పోటీ చేస్తున్నారు. బీహార్లో పాశ్వాన్ బిజెపితో పొత్తు పెట్టుకున్నారు.

నితిన్ గడ్కరీ
బిజెపి మాజీ జాతీయ అధ్యక్షులు నితిన్ గడ్కరీ మహారాష్ట్రలోని నాగపూర్ లోకసభ స్థానానికి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు.

గుల్ పనాగ్
ప్రముఖ నటి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) గుల్ పనాగ్ చండీగడ్‌లో లోకసభకు పోటీ చేస్తున్నారు. ఆమె రెండు రోజుల క్రితం వరకు జోరుగా ప్రచారం చేశారు.












Click it and Unblock the Notifications