'మోడీ నాకంటే మెరుగైన సేల్స్‌మెన్, ఈవెంట్ మేనేజర్'
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీపై మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్ తనదైన శైలిలో విమర్శలు చేశారు. మంగళవారం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మాటలు చెప్పడంలో నరేంద్రమోడీ తనకన్నా ముందు స్ధానంలో నిలిచాడని అన్నారు.

తనకన్నా మోడీ మంచి సేల్స్‌మెన్ అంగీకరించాల్సిందేనని, అంతకు మించి గొప్ప ఈవెంట్ మేనేజరని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు పేర్లు మార్చి తన గొప్పగా ప్రధాని మోడీ ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు.
ప్రధాని మోడీ నియోజక వర్గమైన వారణాసిలో ఎల్‌ఈడీ బల్బుల పంపిణీ
ప్రధాని నరేంద్రమోడీ నియాజకవర్గమైన వారణాసిలో 13 లక్షల ఎల్‌ఈడీ బల్బుల పంపిణీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ విషయాన్ని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.
కేంద్రం, యూపీలోని అఖిలేశ్ ప్రభుత్వంతో కలిసి 2,28,496 గృహాల్లో పూర్తిగా ఈ బల్బుల్ని ఉపయోగించేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు. 36,077 వీధి దీపాలకు సైతం బల్బులు అమర్చనున్నట్లు చెప్పారు. తద్వారా వారణాసిలో 45 మెగావాట్ల విద్యుత్తు, రూ. 68కోట్లు ఆదా కానున్నాయి.












Click it and Unblock the Notifications