PM Narendra Modi: ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులు మారుతారు..!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులు మారుతారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. పశ్చిమ మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. మోడీ శనివారం కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిని లక్ష్యంగా విమర్శలు చేశారు. ప్రతిపక్ష కూటమి మూడంకెల సంఖ్యను లేదా 'ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ద్వారం వద్దకు కూడా చేరుకోలేకపోయిందన్నారు.

అయితే వారికి అవకాశం లభిస్తే ప్రతి సంవత్సరం ఒక ప్రధానమంత్రిని కలిగి ఉండాలనే ఆలోచనలో ఉందని ఎద్దేవా చేశారు. ఓబీసీలకు 27 శాతం కోటాలో ముస్లింలను చేర్చిన కర్ణాటక మోడల్‌ను దేశవ్యాప్తంగా విస్తరించాలని కాంగ్రెస్ కోరుకుంటోందని మోడీ అన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి సామాజిక న్యాయాన్ని ఖూనీ చేస్తానని ప్రతిజ్ఞ చేసిందన్నారు. బుజ్జగింపు, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ దిగజారిందని ఆరోపించారు.

Narendra Modi said that five Prime Ministers will come to the power of India alliance

కాంగ్రెస్ రాజ్యాంగాన్ని మార్చాలని దళితులు, ఓబీసీలకు మతపరమైన రిజర్వేషన్ల కోటా ప్రయోజనాలను దోచుకోవాలని చూస్తోందన్నారు.
అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించడమే కాకుండా దాని ప్రతిష్ఠాపన ఆహ్వానాన్ని కూడా తిరస్కరించిందని మోడీ గుర్తు చేశారు. వారసత్వ పన్ను విధించి ప్రజల వారసత్వాన్ని దోచుకోవాలని కాంగ్రెస్ భావించిందన్నారు. అలాంటి వారికి అధికారంలోకి వచ్చే అవకాశం రాకూడదని చెప్పారు.

లోక్‌సభ ఎన్నికల్లో తొలి రెండు దశల్లో ఎన్డీయే 2-0 ఆధిక్యంలో ఉందన్నారు. 'కొల్హాపూర్‌కు ఫుట్‌బాల్‌ హబ్‌గా పేరుంది. రెండో దశ పోలింగ్‌ పూర్తవడంతో ఎన్‌డీఏ 2-0తో ముందంజలో ఉందని, భారత వ్యతిరేక విధానాలు, విద్వేష రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ కూటమి రెండు సెల్ఫ్ గోల్‌లు వేసుకుందని ఎద్దేవా చేశారు. ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని, సీఏఏ రద్దు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టో చెబుతోందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+