మహిళపై దౌర్జన్యాలు సరికాదు, సిగ్గుతో తలదించుంటున్నాం: మోడీ

న్యూఢిల్లీ: మహిళపై దౌర్జన్యాలు, అత్యాచారాలు, లైంగిక వేదింపులు ఎక్కువవుతున్నాయని, రోజురోజుకు పెరిగిపోతున్న ఈ నేరాలు చూస్తు సిగ్గుతో తలలు దించుకుంటున్నామని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం అన్నారు. ప్రపంచ మహిళ దినోత్సవం సందర్బంగా ఆయన మాట్లాడారు. దేశంలో మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాలను అరికట్టడానికి ప్రత్యేక చట్టం తీసుకువస్తున్నామన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఒన్ స్టాప్ సెంటర్స్ ( 'One-Stop-Centres') ఏర్పాటు చేసి మహిళలపై జరుగుతున్నదౌర్జనాలు, లైంగిక వేదింపులు అరికట్టడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని మోడీ చెప్పారు. మనం అభివృద్ది చెందాలన్నా, దేశం ప్రగతి పథంలో ముందుకు సాగాలన్నా మహిళల భాగస్వామ్యం ముఖ్యం అని చెప్పారు.

భారతదేశంలో స్త్రీలను గౌరవించినట్లు ప్రపంచలో ఏ దేశంలోనా గౌరవించరని ప్రధాని మోడీ గుర్తు చేశారు. అలాంటి భారతదేశంలో కోందరు కీచకులు మహిళలపై దౌర్జన్యం చేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. మహిళను కాపాడటానికి, వారు క్షేమంగా ఉండటానికి కొన్ని చట్టాలలో మార్పులు చెయ్యవలసిన అవసరం ఉందని ప్రధాని మోడీ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Narendra Modi said the government is setting up 'One-Stop-Centres' that will provide assistance, legal advice and psychological counselling to women who face violence or abuse.

మహిళల కోసం ఎర్పాటు చేస్తున్న 'One-Stop-Centres'లో లీగల్ అడ్వజ్ తోపాటు కౌన్సిలింగ్ నిర్వహించడానికి అన్ని ఎర్పాట్లు చేస్తున్నామని మెది వివరించారు. మహిళల కోసం మొబైల్ హెల్ప్ లైన్లు ఎర్పాటు చేస్తున్నామని 181 నెంబర్ కు డయల్ చేసి కౌన్సింగ్ తీసుకొవచ్చని మోది చెప్పారు.

యువతులు విద్యాభ్యాసం కోసం, వివాహం చేసుకోవడం కోసం సుకన్యా సంవృద్ది పథకం ప్రవేశ పెడుతున్నామని, మైక్రో యూనిట్స్ డెవలప్‌మెంట్ రి ఫైనాన్స్ ఏజెన్సీ ద్వారా వారిని ఆర్థికంగా ఆదుకుంటామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు.

మహిళలను ఆదుకోవడానికి ప్రధాన మంత్రి సురక్షా భీమా యోజన, ప్రధాన మంత్రి జీవన్ భీమా యోజన, అటల్ పెన్సన్ యోజన పతకాలను ప్రవేశ పెట్టి మహిళను అన్ని విదాల ఆదుకుంటామని భారత ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ప్రతి ఒక్క భారతీయుడు స్త్రీలను గౌరవించాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+