వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జపాన్ స్కూల్లో మోడీ: విద్యార్థులతో సరదాగా(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

టోక్యో: జపాన్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం టోక్యోలోని ఓ పురాతన పాఠశాలను సందర్శించారు. 136 ఏళ్లనాటి ఆ పాఠశాలలో ఆయన విద్యార్థులతో సరదాగా గడిపారు. పాఠశాలలోని విద్యార్థులందరి కంటే తానే పెద్ద విద్యార్థినని మోడీ నవ్వుతూ వ్యాఖ్యానించారు. పాఠశాలలోని విద్యార్థులతో ఆయన కాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా తాను చాలా విషయాలు తెలుసుకున్నానని తెలిపారు.

ఆధునిక, క్రమశిక్షణ, విలువలను జపాన్ తమ విద్యావిధానంలోకి ఎలా మేళవించిందో అర్థం చేసుకోవడానికే తానీ పాఠశాలను సందర్శించినట్లు నరేంద్ర మోడీ తెలిపారు. కాగా, ప్రధాని మోడీ కోసం పాఠశాల విద్యార్థులు ఓ ప్రత్యేక గీతాన్ని ఆలపించారు. జపాన్ ఉపాధ్యాయుల బృందాన్ని భారతదేశం సందర్శించాలని ఈ సందర్భంగా మోడీ ఆహ్వానించారు. విద్యాశాఖ మంత్రి జపాన్ విద్యావిధానం గురించి ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

అంతకుముందు నరేంద్ర మోడీ.. టోక్యోలో పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. జపాన్‌తో కలిసి పరిశోధనా రంగంలో పనిచేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు. గుజరాత్ సిఎంగా జపాన్ పారిశ్రామికవేత్తలతో కలిసి పనిచేసిన అనుభవం ఉందన్నారు. ప్రభుత్వం, పెట్టుబడిదారుల మధ్య సమన్వయం అవసర మని మోడీ చెప్పారు. పరిపాలనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తామన్నారు.

సుపరిపాలన తమ ప్రభుత్వ ధ్యేయమని మోడీ పేర్కొన్నారు. జపాన్ పారిశ్రామికవత్తేలతో సమన్వయం కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. సుదీర్ఘకాలం తర్వాత జపాన్‌లో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ప్రపంచ ఆర్థికగతిని మార్చిన పారిశ్రామికవేత్తల మధ్య మాట్లాడటం గర్వంగా ఉందని ప్రధాని మోడీ అన్నారు. విశ్వమానవ కల్యాణానికి జపాన్ అందించిన సాయం ఎనలేనిదని మోడీ ప్రశంసించారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

జపాన్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం టోక్యోలోని ఓ పురాతన పాఠశాలను సందర్శించారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

136 ఏళ్లనాటి ఆ పాఠశాలలో ఆయన విద్యార్థులతో సరదాగా గడిపారు. పాఠశాలలోని విద్యార్థులందరి కంటే తానే పెద్ద విద్యార్థినని మోడీ నవ్వుతూ వ్యాఖ్యానించారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

ఆధునిక, క్రమశిక్షణ, విలువలను జపాన్ తమ విద్యావిధానంలోకి ఎలా మేళవించిందో అర్థం చేసుకోవడానికే తానీ పాఠశాలను సందర్శించినట్లు నరేంద్ర మోడీ తెలిపారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

కాగా, ప్రధాని నరేంద్ర మోడీ కోసం పాఠశాల విద్యార్థులు ఓ ప్రత్యేక గీతాన్ని ఆలపించారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

జపాన్ ఉపాధ్యాయుల బృందాన్ని భారతదేశం సందర్శించాలని ఈ సందర్భంగా మోడీ ఆహ్వానించారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

జపాన్‌తో కలిసి పరిశోధనా రంగంలో పనిచేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు. గుజరాత్ సిఎంగా జపాన్ పారిశ్రామికవేత్తలతో కలిసి పనిచేసిన అనుభవం ఉందన్నారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

ప్రభుత్వం, పెట్టుబడిదారుల మధ్య సమన్వయం అవసర మని మోడీ చెప్పారు. పరిపాలనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తామన్నారు. సుపరిపాలన తమ ప్రభుత్వ ధ్యేయమని మోడీ పేర్కొన్నారు.

English summary
Keen to upgrade the educational standards in India, Prime Minister Narendra Modi on Monday visited a 136-year-old school here as a "student" to understand the academic system of Japan which could be replicated back home.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X