Uttarakhand tunnel: స్ఫూర్తిదాయకమంటూ మోడీ హర్షం, కార్మికులతో మాట్లాడిన ప్రధాని

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశీలో సిల్క్‌యారా సొరంగంలో చిక్కుకున్న కార్మికులంతా సురక్షితంగా బయటకు రావడంపై దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. కూలీల మనోధైర్యాన్ని, అహర్నిశలు శ్రమించిన సహాయక బృందాల కృషిని అందరూ ప్రశంసిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా కార్మికులంతా సురక్షితంగా బయటపడటంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించారు. అంతేగాక, కార్మికులకు ఫోన్ చేసి మాట్లాడారు.

ఈ రెస్క్యూ ఆపరేషన్ ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురిచేసిందని చెప్పారు. టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికుల ధైర్యం, సహనం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి దాయకమన్నారు. వారంతా మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. చాలా రోజుల నిరీక్షణ తర్వాత వారంతా తమ కుటుంబ సభ్యులను కలుసుకోవడం గొప్ప సంతృప్తిని కలిగించిందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. ఇలాంటి సవాళ్ల సమయంలో ఆయా కుటుంబాలు ప్రదర్శించిన ధైర్యం ప్రశంస నీయమన్నారు.

Nation Salutes: Relieved After Uttarakhand Tunnel Evacaution, PM Modi Speaks To workers

రెస్క్యూ ఆపరేషన్‌లో ఎంతగానో శ్రమించిన సహాయక సిబ్బందికి సెల్యూట్ చేస్తున్నట్లు ప్రధాని మోడీ చెప్పారు. వారి ధైర్యం, సంకల్పమే కార్మిక సోదరులకు కొత్త జీవితాన్ని ప్రసాదించిందన్నారు. ఈ మిషన్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ మానవత్వం, టీంవర్క్ కు అద్భుతమైన ఉదాహరణగా నిలిచారంటూ ప్రశసించారు ప్రధాని మోడీ.

కాగా, ఉత్తరకాశీలో ఆపరేషన్ టన్నెల్ విజయవంతం కావడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. 17 రోజులపాటు సొరంగంలో సవాళ్లతో కూడిన పరిస్థితులను ఎదుర్కొన్నవారి మనో ధైర్యానికి దేశం సెల్యూట్ చేస్తోందన్నారు. అహర్నిశలు శ్రమించి కూలీలను కాపాడిన వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు, కార్మికులు టన్నెల్ నుంచి సురక్షితంగా బయటపడటంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంతోషం వ్యక్తం చేశారు. రెస్క్కూ బృందానికి సెల్యూ అని చెప్పారు.

ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి.. కార్మికులను బయటకు తీసువచ్చే ఆపరేషన్ ను దగ్గరుండి పర్యవేక్షించారు. టన్నెల్ నుంచి బయటికి వచ్చిన కార్మికులను ఆలింగనం చేసుకుని ఆనందం వ్యక్తం చేశారు. టన్నెల్ నుంచి సురక్షితంగా బయటపడిన ప్రతి కార్మికుడికి రూ. లక్ష సాయం ప్రకటించారు సీఎం ధామి. ఇక, బౌఖ్ నాగ్ ఆలయాన్ని పునర్నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. మరోవైపు, కార్మికులు సురక్షితంగా బయటికి రావడంతో వారి కుటుంబసభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. పటాసులు కాలుస్తూ వారు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+