జేఈఈ మెయిన్ 2023 షెడ్యూల్ వచ్చేసిందోచ్..!!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్ నోటిఫికేషన్ వెలువడింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కొద్దిసేపటి కిందటే ఈ షెడ్యూల్‌ను విడుదల చేసింది. 2023 జేఈఈ మెయిన్స్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలిపింది. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జనవరి 12వ తేదీ వరకు కొనసాగుతుంది. రిజిస్ట్రేషన్ చేయడానికి జనవరి 12 తుది గడువు.
జేఈఈ రాయదలచుకున్న అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేయించుకోవాల్సిన అధికారిక వెబ్ సైట్.. jeemain.nta.nic.in. అభ్యర్థులు తమ క్రెడిట్/డెబిట్ కార్డ్/నెట్-బ్యాంకింగ్/యూపీఐ ద్వారా పరీక్ష ఫీజును చెల్లించవచ్చు. పరీక్షలను నిర్వహించే తేదీ, ఎగ్జామినేషన్ సెంటర్, ఇతర పూర్తి వివరాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రెండవ వారంలో అధికారికంగా విడుదల చేస్తుంది. అడ్మిట్ కార్డులను జనవరి మూడో వారంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

2023-24 విద్యా సంవత్సరం కోసం రెండు సెషన్లల్లో పరీక్షను నిర్వహించనున్నట్లు ఎన్టీఏ తెలిపింది. జనవరిలో సెషన్-1, ఏప్రిల్‌లో సెషన్ 2ను షెడ్యూల్ చేసింది. జేఈఈ మెయిన్ సెషన్ 1 పరీక్షను జనవరి 24, 25, 27, 28, 29, 30, 31 తేదీల్లో షెడ్యూల్ చేసింది.
సెషన్ 2 పరీక్ష ఏప్రిల్ 6, 7, 8, 9, 10, 11, 12 తేదీల్లో ఉంటుంది. మొత్తంగా 13 భాషల్లో అంటే- ఇంగ్లీష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడం, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ మీడియంలల్లో పరీక్షలు ఉంటాయి.

ముందుగా అభ్యర్థులు jeemain.nta.nic.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. హోమ్ పేజీ దిగువన ఉన్న అప్లికేషన్‌ను క్లిక్ చేయాలి. న్యూ రిజిస్ట్రేషన్ అనే అక్షరాలు కనిపిస్తాయి. వాటిపై క్లిక్ చేయాలి. వివరాలను నమోదు చేయాలి. అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ను తొలుత రిజిస్టర్ చేసుకోవాలి. అనంతరం దాన్ని ఉపయోగించి లాగిన్ కావాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారంను పూర్తి చేసిన అనంతరం అందులో పొందుపరిచిన వివరాలకు అనుగుణంగా అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. ఫీజ్ చెల్లించాలి. దరఖాస్తు ఫారంను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications