సిద్దూపై హాట్ కామెంట్స్.. భాష బాగుండాలి, సొంత పార్టీ ఎంపీ చురకలు
పంజాబ్ పోలింగ్ ముగిసింది.. ఓటర్లు తమ నిర్ణయాన్ని ఈవీఎంలలో చెప్పేశారు. వాటి లెక్కింపే తరువాయి.. అదీ ఇప్పుడే కాదు.. మార్చి 10వ తేదీ వరకు ఆగాల్సిందే. అయితే పంజాబ్ కాంగ్రెస్‌లో పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూ.. అన్నీ తానై నడిపించాడు. సీఎం చన్నీ కూడా ఉన్నా.. తనే డామినేట్ చేశాడు. అయితే అతనికి విమర్శలు మాత్రం తప్పడం లేదు. అవును ఎన్నికల ముందు సోదరి.. హాట్ కామెంట్స్ చేయగా.. ఇప్పుడు ఎంపీ వంతు వచ్చింది.
గత ఐదేళ్లలో ప్రజలతో సిద్దూ కలిసిపోలేదని ఎంపీ గుర్జీత్ సింగ్ అజ్లా ఆరోపించారు. కానీ నేతలపై కామెంట్ చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. దీంతో ప్రజలు విసుగు చెందారని తెలిపారు. ఇదీ కాంగ్రెస్ పార్టీ విజయంపై ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పారు.

సిద్దూ.. ఒక జాతీయ నేత మాదిరిగా ప్రవర్తించారని ఆరోపించారు. ప్రజలకు కనీస సమయం కూడా కేటాయించలేదని మండిపడ్డారు. అంతేకాదు అతని మాటతీరు కూడా సరిగా ఉండదని.. విద్వేషపూరితంగా ఉంటుందని మండిపడ్డారు. డ్రగ్స్, ఇతర అంశాలపై బహిరంగ వేదికలపై మాట్లాడిన.. మంచి పదజాలం వాడరని వివరించారు.
సిద్దూ గొప్ప నేత.. అందరూ అతనని చూస్తారు, అనుసరిస్తారు అని వివరించారు. అతను అభ్యంతరకర భాష ఉపయోగించొద్దు అని చెప్పారు. ఇతర పార్టీ నేతలను గౌరవంగా సంభోదించి ఉంటే బాగుండేది అని చెప్పారు. గొప్ప నేత.. మర్యాదగా ఉండాలని.. అతనిపై రాష్ట్రం, దేశాన్ని నడిపించే గల బాధ్యత ఉంటుందని పేర్కొన్నారు.
Recommended Video
సిద్దూ స్టార్ క్యాంపెయినర్ అని.. ఇందులో సందేహాం లేదని చెప్పారు. కానీ అతని భాషే అడ్డంకిగా మారుతుందని చెప్పారు. అమృత్ సర్ ఈస్ట్ నుంచి సిద్దూ బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక్కడ త్రిముఖ పోటీ ఉంటుందని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications