మా ఆయన బంగారం.. సిద్ధూ సీఎం అయినా, కాకపోయినా హీరోనే: నవజ్యోత్ కౌర్
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ప్రధాన పార్టీలన్నీ ప్రచార పర్వంలో దూసుకెళ్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఓ అడుగుమందుకు వేసి ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ప్రకటించింది. కానీ అధికార కాంగ్రెస్ పార్టీ తమ సీఎం అభ్యర్థిని ప్రకటించాడానికి తర్జనభర్జన పడుతుంది. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలే.. దీనికి ప్రధాన కారణంగా కన్పిస్తోంది. పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి కోసం ప్రధానంగా ప్రస్తుత సీఎం చన్నీ, సిద్ధూ మధ్యే పోటీ నెలకొంది.

సీఎం అయినా కాక పోయినా సిద్ధూ హీరోనే..
పంజాబ్ కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో సీఎం అభ్యర్థి ఎంపికపై అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో పంజాబ్ పిసిసి చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సిద్ధూపై ఆయన సతీమణి నవజ్యోత్ కౌర్ ప్రశంసల జల్లు కురిపించారు. మా ఆయన బంగారం అంటూ ఆకాశానికి ఎత్తారు. సిద్ధూ పంజాబ్ ముఖ్యమంత్రి అయినా కాకాపోయినా హీరోనే అని పేర్కొన్నారు.

కెప్టన్ అమరీందర్ సింగ్‌పై విమర్శలు
రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా మంత్రుల మాట వినాలి .. వారు ఆమోదించిన ఫైళ్లపై సంతకాలు చేయాలని నవజ్యోత్ కౌర్ పేర్కొన్నారు. మంత్రులు తమ పని తాము చేసే విధంగా సీఎం వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. నాడు పంజాబ్ సీఎం కెప్టన్ అమరీందర్ సింగ్ ఇలా చేసి ఉంటే ఎవరికీ ఇబ్బంది ఉండేది కాదని పేర్కొన్నారు. కానీ, ఆయన నాడు అలా పని చేయలేదన్నారు. మంత్రులను కూడా గౌరవించలేదని నవజ్యోత్ కౌర్ విమర్శలు గుప్పించారు.
Recommended Video

6న సీఎం అభ్యర్థిని ప్రకటించనున్న అధిష్టానం
పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగాలని సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ, పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు సిద్ధూ ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఎవరిని ఎంపిక చేయాలో అన్నది కాంగ్రెస్ అధిష్ఠానం తర్జనభర్జన పడుతూ ఎటూ తేల్చలేకపోతున్నది. ఎవరిని ఎంపిక చేస్తే ఎలాంటి ముప్పు పొంచి ఉందో అన్న ఆలోచనతో .. ఇప్పటికే సీఎం అభ్యర్థి ఎంపికను రెండు సార్లు వాయిదా వేసింది. అయితే ఫిబ్రవరి 6న సీఎం అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటిస్తుందని సీఎం చన్నీ తెలిపారు..












Click it and Unblock the Notifications