బలహీన వ్యక్తిని సీఎం చేయాలని చూస్తోంది.. కాంగ్రెస్ హైకమాండ్‌పై సిద్ధూ అటాక్..
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలతో సతమతమవుతుంది. పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ముఖ్యమంత్రి చన్నీ మధ్య విభేదాలు మరో సారి బయటపడ్డాయి. అధికారమే లక్ష్యంగా ప్రతిపక్షాలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. కానీ, అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం అంతర్గత కుమ్ములాటతో ప్రచారంలో వెనుకబడిపోయింది. ఈ పరిణామాలన్నీ పార్టీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారాయి.

సీఎం అభ్యర్థి ఎంపికపై అధిష్టానానికి తలపోటు
పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతుంది. ప్రస్తుత సీఎం చన్నీ, పీసీసీ చీఫ్ సిద్ధూ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం అభ్యర్థి ఎవరన్నది పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ ఆదివారం ప్రకటించనున్నారు. పంజాబ్‌లో రాహుల్ గాంధీ ఆ రోజు పర్యటించనున్నారు. ఈ పర్యటనలోనే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఓ బలహీన వ్యక్తిని సీఎం పీఠంపై..
ఈ నేపథ్యంలో పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. పార్టీ అధిష్టానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ బలహీనమైన వ్యక్తిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడానికి పార్టీ అధిష్టానం ప్రయత్నిస్తోందని ఆరోపణలు గుప్పించారు. అధిష్టానం ఎది చెబితే దానికి తల ఊపే వ్యక్తినే సీఎం పీఠంపై కూర్చోబెట్టడానికి సిద్ధమవుతున్నట్లు నవజ్యోత్ సింగ్ సిద్ధూ కీలక వ్యాఖ్యలు చేశారు.

పార్టీ అధిష్టానంపై సిద్ధూ అసహనం
పంజాబ్‌ను అభివృద్ధి పథంలో నడిపించే బాధ్యత, అవకాశం ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉంటుంది సిద్ధూ అన్నారు . అలాంటి వ్యక్తిని సీఎంగా ఎన్నుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. బలహీనమైన వ్యక్తి కావాలో.. సమర్థవంతమైన ముఖ్యమంత్రి మీకు కావాలో నిర్ణయించుకోవాలని పార్టీ కార్యకర్తలకు సిద్ధూ సూటిగా ప్రశ్నించారు. పంజాబ్ సీఎం కావాలని సిద్ధూకు ఎప్పటి నుంచో ఉంది. మాజీ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ ను సీఎం పదవి నుంచి తొలగించడంలో సక్సెస్ అయ్యారు. సీఎం పీఠం కోసం సిద్ధూ ప్రయత్నించినా.. చివరకు చన్నీని ముఖ్యమంత్రిగా అధిష్టానం చేసింది.. అప్పటి నుంచి పార్టీపై అసహనంతో సిద్ధూ ఉన్నారు..












Click it and Unblock the Notifications