చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెన్నై: రంగంలోకి ఐఎస్ఎస్ ఐరావత్, హెల్ప్‌లైన్ నెంబర్లు ఇవే

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

చెన్నై: గత నెలరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెన్నై నగరం నీట మునిగింది. ఇంకా నాలుగు రోజుల పాటు ఈ భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలు తీవ్రా ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. చెన్నై-బెంగుళూరు మధ్య పూర్తిగా రాకపోకలు స్తంభించాయి.

దీంతో రిజర్వాయర్‌లోని నీటిని వదలాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. రోజుకు 20 సెం.మీ వర్షం కురుస్తుందని హెచ్చరికలు జారీ చేయడంతో చెన్నై వాసుల్లో టెన్షన్ మొదలైంది. కొన్ని చోట్ల అపార్ట్ మెంట్స్‌లోని మొదటి అంతస్తులోకి వరద నీరు చేరడంతో ఎన్‌డీఆర్ఎఫ్ సహాయక చర్యలు చేపట్టింది.

Navy launches UAVs to assess flood impact in Chennai

ఎన్‌‌డీ‌ఆర్‌ఎఫ్‌కు తోడు సహాయక చర్యల్లో నేవీ కూడా రంగంలోకి దిగినట్లు నేవీ పీఆర్వో సీజీ రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాలతో నీట మునిగిన చెన్నైలో సహాయక చర్యల కోసం విశాఖ నుంచి చెన్నైకు ఐఎస్ఎస్ ఐరావత్ బయల్దేరిందన్నారు. ఐఎస్ఎస్ ఐరావత్ లో 5 జెమినీ బోట్లు, 20 మంది గజ ఈతగాళ్లు, సహాయ సామగ్రి ఉంటాయని చెప్పారు.

మరోవైపు చెన్నై వరద సహాయక చర్యల్లో సైన్యం పాల్గొందని కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. ఇందుకోసం రెండు కంపెనీల బలగాలను పంపామని, అవసరమైతే మరిన్ని బలగాలు పంపుతామని చెప్పారు. చెన్నై, పుదుచ్చేరిలో సహాయక చర్యలు కోసం మరిన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బయలుదేరి వెళుతున్నాయి.

Navy launches UAVs to assess flood impact in Chennai

మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో చెన్నై వాసులు భయాందోళన చెందుతున్నారు. 50 సెంటీమీటర్లు వర్షం కురిసే అవకాశముందని బీబీసీ హెచ్చిరింది. నిత్యావసరాలు అందుబాటులో ఉంచుకోవాలని ప్రజలకు సూచించింది. సహాయక చర్యల కోసం 011 2436 3260, 97110 77372 నంబర్లకు ఫోన్ చేయాలని అధికారులు తెలిపారు.

స్టేట్ ఎమర్జెన్సీ- 1070
జిల్లా ఎమర్జెన్సీ- 1077
ఎలక్ట్రిసిటీ- 1912
ఫైర్ అండ్ రెస్క్యూ- 101
సీవేజ్ ఓవర్ ఫ్లో- 45674567, 22200335
ట్రీ ఫాల్, వాటర్ లాగింగ్- 1913
నేవీ హెల్ప్ లైన్: 044-25394240

English summary
The Indian Navy has swung into action to help Chennaites reeling under another round of heaving rains and subsequent flooding. Navy Spokesperson Capt D K Sharma said that UAVs have been launched for assessment of flood situation in different parts of Chennai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X