బ్రిడ్జ్ కింద టైం బాంబు పెట్టిన నక్సల్స్
ఔరంగాబాద్: వందల గ్రామాలకు అనుసంధానంగా ఉన్న బ్రిడ్జ్ ను పేల్చి వెయ్యడానికి టైం బాంబు అమర్చిన సంఘటన బీహార్ లోని ఔరాంగాబాద్ సమీపంలో జరిగింది. అయితే అదృష్టవశాత్తు స్థానికులు ఆ బాంబును గుర్తించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ఔరంగాబాద్ సమీపంలోని దేవ్ - కిటాకి చానెల్ బ్రిడ్జ్ కింద టైం బాంబు పెట్టారు. అక్కడ టెం బాంబు చప్పుడు రావడం, అదే సమయంలో స్థానికులు బ్రిడ్జ్ సమీపంలో వెళ్లడంతో వారికి అనుమానం వచ్చింది. బ్రిడ్జ్ కింద పరిశీలించగా టైం బాంబు కనపడింది.

వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, బాంబు నిర్వీర్యదళం బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తరువాత టైం బాంబును బ్రిడ్జ్ సమీపంలోకి తీసుకు వెళ్లి నిర్వీర్యం చేశారు. వెంటనే పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.
ముందు జాగ్రత చర్యగా పరిసర ప్రాంతాలలోని బ్రిడ్జ్ ల కింద పరిశీలించారు. పలు బ్రిడ్జ్ ల దగ్గర సాయుధ బలగాలను భద్రత కోసం నియమించారు. 2010వ సంవత్సరంలో ఇదే బ్రిడ్జ్ కింద బాంబు పెట్టిన నక్సల్స్ దానిని పేల్చి వేయడంతో చాల భాగం దెబ్బతినిందని పోలీసులు తెలిపారు. కచ్చితంగా నక్సల్స్ ఇక్కడ టైం బాంబు అమర్చి ఉంటారని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications