మోడీ పర్యటనకు మావోల నిరసన: 400మంది గ్రామస్తుల కిడ్నాప్
సుకుమా: ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో మావోయిస్టులు దారుణానికి తెగబడ్డారు. సుకుమాజిల్లాలోని దాదాపు 400 మంది గ్రామస్థులను మావోయిస్టులు అపహరించినట్లు సమాచారం. ప్రధాని పర్యటన నేపథ్యంలో మావోయిస్టులు గ్రామస్థులను అపహరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
విమానంలో జగ్‌దల్‌పూర్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ్నుంచి దంతెవాడ బయలుదేరనున్నారు. కాగా, గిరిజనుల అపహరణ విషయాన్ని సుకుమా ఎస్పీ కూడా ధృవీకరించారు.

మోడీ పర్యటనను నిరసిస్తూ మావోయిస్టులు భారీ ఎత్తున గిరిజనుల అపహరణకు పాల్పడినట్లు తెలుస్తోంది. మోడీ సభకు తరలివెళ్తున్న సమయంలోనే మావోయిస్టులు అపహరణకు పాల్పడినట్లు తెలిసింది.
సుకుమా జిల్లా మారంగి వద్ద గిరిజనులను కిడ్నాప్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, అపహరణకు గురిైన గ్రామస్తుల కోసం పోలీసు దళాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి.












Click it and Unblock the Notifications