హర్యానా ముఖ్యమంత్రిగా సైనీ ప్రమాణం-13 మంత్రులు కూడా-మోడీ, బాబు, పవన్ హాజరు..!
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం నేపథ్యంలో బీజేపీ కొత్త సర్కార్ ఇవాళ కొలువుదీరింది. వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ బాధ్యతలు చేపట్టారు. గవర్నర్ బండారు దత్రాత్రేయ ఆయనతో ప్రమాణం చేయించారు. సైనీతో పాటు 13 మంది మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేశారు. 90 సీట్లున్న హర్యానా అసెంబ్లీలో 13 మంది మంత్రులకే అవకాశం ఉంది. దీంతో పూర్తిస్దాయి కేబినెట్ ప్రమాణస్వీకారం చేసినట్లయింది.
నిన్న పంచకులలో జరిగిన సమావేశంలో నాయబ్ సింగ్ సైనీ బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన ఇవాళ సీఎంగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, అమిత్ షా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో పాటు ఎన్డీయే రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నేతలు హాజరయ్యారు. ఇవాళ మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో సీఎం నయాబ్ సింగ్ సైనీతో పాటు
అనిల్ విజ్, క్రిషన్ లాల్ పన్వార్, రావ్ నర్బీర్ సింగ్, మహిపాల్ దండా, విపుల్ గోయెల్, అరవింద్ కుమార్ శర్మ, శృతి చౌదరి,శ్యామ్ సింగ్ రాణా, రణబీర్ సింగ్ గాంగ్వా, క్రిషన్ బేడీ, గౌరవ్ గౌతమ్, ఆర్తి సింగ్ రావు, రాజేష్ నగర్ ఉన్నారు.

హర్యానా అసెంబ్లీకి తాజాగా జరిగిన ఎన్నికల్లో 90 సీట్లలో బీజేపీ 48 సీట్లు గెల్చుకుని హ్యాట్రిక్ విజయం అందుకుంది. విపక్ష కాంగ్రెస్ పార్టీ 37 స్ధానాలకు పరిమితమైంది. దీంతో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. అలాగే వరుసగా రెండోసారి సీఎంగా 54 ఏళ్ల దళిత నేత నాయబ్ సింగ్ సైనీ పగ్గాలు చేపడుతున్నారు. హర్యానాలో బీజేపీ సాధించిన విజయం ఎన్డీయేకు చాలా కీలకంగా మారింది. దీంతో ఇవాళ ప్రమాణస్వీకారం తర్వాత ఎన్డీయే రాష్ట్రాల సీఎంలు చండీఘడ్ లో బల ప్రదర్శన చేయబోతున్నారు.












Click it and Unblock the Notifications