నయనతార కూడా.. వ్యాపార రంగంలోకి, ఏ బిజినెస్ అంటే..
నటులు, క్రికెటర్లు.. కెరీర్ ముగిశాక వ్యాపారంలోకి అడుగిడటం సహజమే. ఇదివరకు చాలామంది తారలు, స్పోర్ట్స్ పర్సన్స్ బిజినెస్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ జాబితాలో నయనతార చేరారు. చెన్నైకు చెందిన ఛాయ్ వ్యాపారంలో నయనతార పెట్టుబడులు పెట్టారు. పలువురు ఇన్వెస్టర్లు ఉన్న ఆ ఛాయ్ వాలె బ్రాండ్‌లో ఆమె కూడా వాటా కలిశారు. దీంతో నయనతార కూడా.. వ్యాపార రంగంలో ఎంట్రీ ఇచ్చినట్టు అయ్యింది.

నయన్ బిజినెస్..
వ్యాపారాన్ని విస్తరించే క్రమంలో నటి నయనతార, డైరక్టర్ విగ్నేశ్ శివన్ కూడా పెట్టుబడులు పెట్టారని ఫౌండర్ విధుర్ మహేశ్వరీ ప్రకటించారు. ఏంజిల్ ఇన్వెస్టర్లు సునీల్ సేథియా, సునీల్ కుమార్ సింఘ్వి, మనీశ్ మార్దియా, యూఎన్ఐ-ఎమ్ నెట్‌వర్క్, ముంబైకు చెందిన ఏంజిల్ నెట్‌వర్క్ ఇప్పటికే భాగస్వాములుగా ఉన్నారని ఆమె వివరించారు. ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అయిన బెంగళూరుకు చెందిన యూనిలిస్టెడ్ కార్ట్ ఎల్ఎల్పీ (ఆన్ లైన్ ట్రేడింగ్ ప్లాట్ ఫాం), చెన్నై నుంచి మల్టీ ఫ్యామిలీ ఆఫీస్ ఈ ఫండింగ్ లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారని ఎక్స్ ప్లేన్ చేశారు.

80 శాతం వాటా ఇందుకే..
ప్రస్తుత ఫండింగ్ లో 80 శాతం వరకూ ఫిజికల్ స్టోర్ విస్తరణ కోసమే వాడనున్నామని ప్రకటించారు. వచ్చే ఏడాది కల్లా 35 పూర్తి ఫంక్షనరీ స్టోర్స్ రావాలని చూస్తున్నామని... మిగిలిన ఫండింగ్‌తో బ్యాక్ ఎండ్ సిస్టమ్, మేనేజెరియల్ టీం విస్తరణ గురించి ఆలోచిస్తున్నామని ఛాయ్ వాలె ఫౌండర్ విధుర్ మహేశ్వరీ తన లక్ష్యాల గురించి వివరించారు.

మెట్రో, మాల్స్‌లో..
మెట్రో స్టేషన్లు, మాల్స్‌లో కొత్త బ్రాంచ్ లు ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. కొవిడ్ అన్ లాక్ అయిన తర్వాత డిజిటల్ మార్కెటింగ్, ఈ కామర్స్ బడ్జెట్ కేటాయింపులు పెంచుకున్నామని పేర్కొన్నారు. ఆన్ లైన్ లో కొత్త కస్టమర్లను ఆహ్వానిస్తూ.. పాత కస్టమర్లను కంటిన్యూ చేయాలని భావిస్తున్నామని మహేశ్వరీ స్పష్టం చేశారు.

సొట్టబుగ్గల చిన్నది కూడా..
సో.. నయనతార కూడా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారని స్పష్టం అయ్యింది. క్రికెటర్ జహీర్ ఖాన్ రెస్టారెంట్ పెట్టిన సంగతి తెలిసిందే. మిగతా స్పోర్ట్స్ పర్సన్స్ కూడా బిజినెస్ చేస్తున్నారు.
-
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి..












Click it and Unblock the Notifications