ఆ స్టార్ హీరోను డ్రగ్స్ బానిసగా మార్చిన హీరోయిన్: నార్కొటిక్స్ బ్యూర్ కేసు ఫైల్
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు తాజాగా మరో మలుపు తిరిగింది. కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ముందు నుంచీ పలు ఆరోపణలను ఎదుర్కొంటోన్న బాలీవుడ్ నటి రియా చక్రవర్తి పేరు మరోసారి తెర మీదికి వచ్చింది. తాజాగా ఆమెపై నార్కొటిక్స్ కంట్రోల్ బ్యురో అధికారులు డ్రాఫ్ట్ ఛార్జ్‌ను నమోదు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పలు సెక్షన్ల కింద ఎన్సీబీ అధికారులు ఆమెపై కేసులు నమోదు చేశారు.
రెండేళ్ల కిందట సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించిన విషయం తెలిసిందే. ముంబై బాంద్రాలోని ఇంట్లో ఆయనను నిర్జీవంగా గుర్తించారు పోలీసులు. ఈ కేసులో అదే ఏడాది సెప్టెంబర్ 8వ తేదీన రియా చక్రవర్తిని అరెస్ట్ చేశారు. డ్రగ్స్ సంబంధిత కేసులో ఆమెను అరెస్ట్ చేశారు. రిమాండ్‌కు తరలించారు. సుమారు నెల రోజుల పాటు ముంబై బైకుల్లా జైలులో గడిపారు. అనంతరం బెయిల్ మీద విడుదలయ్యారు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు.

ఈ కేసులో దర్యాప్తు అధికారులు ఆమె పేరును ఏ10గా చేర్చారు. తాజాగా ఆమెపై డ్రాఫ్ట్ ఛార్జ్‌ను ఫైల్ చేశారు. పలు కీలక అంశాలను ఇందులో పొందుపరిచారు. డ్రగ్స్‌ను కొనుగోలు చేసి, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు అందించేదని పేర్కొన్నారు. గంజాయి, చరస్, కొకైన్ సహా కొన్ని రకాల డ్రగ్స్, సైకోట్రొపిక్ సబ్‌స్టాన్సెస్‌కు అతను అలవాటు పడేలా చేసిందని చెప్పారు. తన సోదరుడు షౌవిక్ చక్రవర్తితో పాటు తనకు తెలిసిన డ్రగ్ పెడ్లర్ల నుంచి వాటిని కొనుగోలు చేసేదని స్పష్టం చేశారు.
ఒకరకంగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డ్రగ్స్‌కు అలవాటు పడటానికి రియా చక్రవర్తి కారణమని అన్నారు. రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షౌవిక్ చక్రవర్తి క్రమం తప్పకుండా డ్రగ్ పెడ్లర్లతో మంతనాలు సాగించే వారని, ఎప్పటికప్పుడు గంజాయి లేదా డ్రగ్స్‌ను వారి వద్ద నుంచి కొనే వారని ఎన్సీబీ అధికారులు తమ డ్రాఫ్ట్ ఛార్జ్‌లో పొందుపరిచారు. ప్రత్యేకించి డ్రగ్ పెడ్లర్ శామ్యుల్ మిరిండాతో వారు తరచూ మాట్లాడే వారని, ఈ విషయం తమ దర్యాప్తులో తేలదని పేర్కొన్నారు.
రియా చక్రవర్తిపై సెక్షన్ 8సీ, సెక్షన్ 20 (బీ) (2), సెక్షన్ 27ఏ, 28 కింద కేసులు నమోదయ్యాయి. ఉద్దేశపూరకంగానే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు మాదక ద్రవ్యాలను అలవాటు చేసిందని పేర్కొన్నారు. ఇదివరకు సుశాంత్ సింగ్-రియా చక్రవర్తి సన్నిహితంగా మెలిగిన విషయం తెలిసిందే. వారిద్దరూ సహజీవనం చేసినట్లుగా వార్తలొచ్చాయి అప్పట్లో. ఆ సమయంలో అతనికి డ్రగ్స్‌ను అలవాటు చేసినట్లు మొదట్లో వచ్చిన ఆరోపణలు.. ఈ తాజా డ్రాఫ్ట్ ఛార్జ్‌తో నిజం అయ్యాయని అభిమానులు చెబుతున్నారు.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..!












Click it and Unblock the Notifications