Goa elections: ప్రచారానికి 24మంది స్టార్ క్యాపెయినర్ల జాబితా ప్రకటించిన ఎన్సీపీ; రంగంలోకి శరద్ పవార్
గోవా అసెంబ్లీ ఎన్నికలకు ముందు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) రాబోయే ఎన్నికల కోసం 24 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను బుధవారం విడుదల చేసింది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సహా పార్టీ సీనియర్ నేతలు, మంత్రులు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని పార్టీ ప్రకటించింది. శివసేనతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ఎన్సీపీ గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.
Recommended Video

గోవా ఎన్నికల ప్రచార స్టార్ క్యాంపెయినర్ల జాబితా ప్రకటించిన ఎన్సీపీ
ఎన్సీపీ విడుదల చేసిన జాబితా ప్రకారం ఆ పార్టీ కీలక నేతలు శరద్ పవార్, ప్రఫుల్ పటేల్, సుప్రియా సూలే, అజిత్ పవార్ తదితరులు రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఈ జాబితాపై పార్టీ శాశ్వత కార్యదర్శి ఎస్‌ఆర్ కోహ్లీ సంతకం చేశారు. గోవా అసెంబ్లీ ఎన్నికలకు ఎన్సీపీ గత నెలలో అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. గత నెలలో ఎన్సీపీ గోవా అసెంబ్లీ ఎన్నికలకు నలుగురు అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది.

శివసేనతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తున్న ఎన్సీపీ
జాబితా ప్రకారం, దబోలిమ్ నుండి పోటీ చేయనున్న రాష్ట్ర ఎన్సీపీ చీఫ్ జోస్ ఫిలిప్. మరోవైపు రెహ్నాన్ ముజావర్ నవేలిమ్ నుంచి, దిగవిజయ్ వెర్లేకర్ ప్రియోల్ నుంచి, డాక్టర్ సుభాష్ ప్రభు దేశాయ్ శిరోడా నుంచి పోటీ చేయనున్నారు.గోవా ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎన్సీపీ గతంలో శివసేనతో పొత్తు పెట్టుకున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు, రాష్ట్రంలో ఎన్నికల సమయం సమీపిస్తున్న తరుణంలో పెరుగుతున్న పొలిటికల్ హీట్ మధ్య పార్టీ యొక్క స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల చేసింది.

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో వ్యూహాలతో పార్టీలు
ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ గోవా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. బిజెపి రాష్ట్రంలో అధికారాన్ని నిలుపుకునే పోటీలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. గోవా అసెంబ్లీ ఎన్నికలు 2022 ఫిబ్రవరి 14న జరగనున్నాయి.అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ మరియు మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC) గోవా 2022 ఎన్నికల రాజకీయాలలో అరంగేట్రం చేయడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాయి. అధికారంలో ఉన్నబీజేపీ తిరిగి అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకుంది.

టీఎంసీ ఎంజిపితో పొత్తు; కాంగ్రెస్, గోవా ఫార్వర్డ్ పార్టీతో పొత్తు
ప్రస్తుతం గోవా రాష్ట్ర శాసనసభలో ఆమ్ ఆద్మీ పార్టీకి మరియు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రెండింటికీ ఒక్క శాసనసభ్యుడు కూడా లేడని చెప్పాలి. నివేదికల ప్రకారం, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎంజిపి) గోవా ఎన్నికల్లో టిఎంసితో పొత్తుతో పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉంటే కాంగ్రెస్, గోవా ఫార్వర్డ్ పార్టీ ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకున్నాయి. గోవా శాసనసభకు 40 మంది శాసన సభ్యులను ఎన్నుకునేందుకు ఒకే దశలో ఫిబ్రవరి 14న గోవాలో ఎన్నికలు జరగనున్నాయి. గోవా ఎన్నికల 2022 ఫలితాలు మార్చి 10న ప్రకటించబడతాయి.

గత ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచినా అధికారం దక్కించుకోలేకపోయిన కాంగ్రెస్
అంతకుముందు గోవా ఫిబ్రవరి 4, 2017న ఎన్నికలకు వెళ్లింది. మార్చి 18, 2017న ఫలితాలు ప్రకటించబడ్డాయి. ఫలితాల ప్రకటన తర్వాత, భారత జాతీయ కాంగ్రెస్ 17 స్థానాలతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ఆ పార్టీ పొత్తు పెట్టుకోవడంలో విఫలమైంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గోవా ఫార్వర్డ్ పార్టీ మరియు మహారాష్ట్ర వాది గో మంతక్ పార్టీ మరియు స్వతంత్రుల మద్దతుతో 13 సీట్లతో బిజెపి గోవా రాష్ట్రంలో తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.












Click it and Unblock the Notifications