Sharad Pawar: అదానీపై జేసీపీ విచారణకు వ్యతిరేకం కాదు: శరద్ పవార్

అదానీపై జాయింట్ పార్లమెంటరీ పార్టీ (JPC) విచారణను తాను వ్యతిరేకించనని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. అదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత జేపీసీ విచారణకు కాంగ్రెస్‌తోపాటు పలు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. "ఒక స్నేహితుడి అభిప్రాయం నాకు భిన్నంగా ఉండవచ్చు. కానీ ఇందులో మనం ఐక్యంగా ఉండాలి. నేను నా అభిప్రాయం చెప్పాను.

కానీ జెపీసీ విచారణ అవసరమని సహచరులు భావిస్తే, నేను దానిని వ్యతిరేకించను. వారి అభిప్రాయంతో నేను ఏకీభవించకపోవచ్చు. కానీ ప్రతిపక్షాల బలాన్ని ప్రభావితం చేయనివ్వదు" అని మంగళవారం సాయంత్రం ప్రసారమైన ఒక మరాఠీ టీవీ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవార్ చెప్పారు.

 NCP chief Sharad Pawar says he is not against a joint parliamentary inquiry into Adani

"జేపీసీని ఏర్పాటు చేస్తే, లోక్‌సభలో మెజారిటీ ఉన్నందున మెజారిటీ సభ్యులు బీజేపీకి చెందినవారు ఉంటారు. మిగిలిన కొద్దిమంది ప్రతిపక్షం నుంచి ఉంటారు. అయితే ప్రతిపక్షాలు కోరుకుంటే నేను అభ్యంతరం చెప్పను" అని పవార్ వివరించారు.

గత వారం ఒక జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవార్ JPC విచారణపై తన అభ్యంతరాలను వ్యక్తం చేశారు. "తమ పార్టీ JPCకి మద్దతు ఇచ్చింది. అయితే JPC అధికార పార్టీ ఆధిపత్యంలో ఉంటుందని నేను భావిస్తున్నాను" అని తెలిపారు. సత్యాన్ని బయటకు తీసుకురావడానికి SC పర్యవేక్షణ ప్యానెల్ మంచి మార్గం అని నేను భావిస్తున్నట్లు చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ మోడీ టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు. మోడీ సపోర్ట్ తోనే అదానీ వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు. కాగా అదానీ ఇష్యూపై విచారణ చేయాలని సుప్రీం కోర్టు ఒక కమిటీని వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+