ఇండియా టుడే ఎగ్జిట్‌పోల్ ఫలితాల్లో ఎన్డీఏకు ఆధిక్యత...NDA 339 -368, UPA- 77 -108

2019 ఎన్నికలు దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 10 నుండి మే 19 వరకు ఏడు దశల్లో ఎన్నికలు జరిగాయి మరో నాలుగు రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలోనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాల్లో పూర్తిగా ఎన్డీఏకు అధిక స్థానాలు వచ్చాయి. ఈనేపథ్యంలోనే ఇండియా టుడే ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో పూర్తి మెజరిటీ దక్కే అవకాశాలు కనిపించాయి. .పార్టీ చీఫ్ అమిత్ షాతో పాటు బీజేపీ నాయకులు చెప్పినట్టుగా 300 మార్కు దాటింది. కాగా ఇండియా టుడే ప్రకటించిన ఫలితాల్లో ఎన్డీఏకు అలయెన్స్...339 -368 స్థానాలు ప్రకటించగా యూపిఏ పక్షలకు 77 -1o8 గెలుపొందనుండగా ఇతర పార్టీలు కలిసి 69 -95 స్థానాలు స్థానాలు గెలుపోందనున్నట్టు ప్రకటించింది.

ఉత్తర ప్రదేశ్‌లో పదిలంగా ఉన్న బీజేపీ స్థానాలు..

ఉత్తర ప్రదేశ్‌లో పదిలంగా ఉన్న బీజేపీ స్థానాలు..

కాగా ఉత్తర భారతంలో ఈసారి ఎన్నికల్లో బీజేపీకి తక్కువ సీట్లు సాధిస్తుందని దీంతో ఇతర పార్టీల మద్దతుపై ఆధారపడక తప్పదని భావించారు. కాని అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ ఉత్తర భారతంలో ఈసారి కూడ బీజేపీకి ఫుల్ మెజారీటిని ఇచ్చారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌ 2014 లో బీజేపీ ఏకంగా 71 సీట్లు సాధించి అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశాన్ని ప్రజలు కల్పించారు. దీంతో 2019 ఎన్నికల్లో సీట్లు తగ్గుతాయనే ప్రచారం విపరీతంగా జరిగింది. అయితే అందరు భావించినట్టుగా మాత్రం గతంలో కంటే బీజేపీని ఎక్కువ శాతం ప్రజలు ఆదరించారు.

యూపిలో బీజేపీకి పెరిగిన ఓటింగ్ శాతం తగ్గిన సీట్లు

యూపిలో బీజేపీకి పెరిగిన ఓటింగ్ శాతం తగ్గిన సీట్లు

2014లో 44 శాతం ఓట్ల శాతన్ని సాధించి 71 సీట్లను గెలుపోందింది, ఇక ప్రస్థుత ఎన్నికల్లో ప్రజాదరణను పోందింది. గతంలో కంటే మరో 4 శాతం అదనంగా ఓట్లను పోంది..48 శాతం ఓట్లను సాధించింది. అయితే సీట్ల విషయంలో మాత్రం 5 నుండి 6 సీట్లు మాత్రం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈనేపథ్యంలోనే ఇండియా టుడే ప్రకటించిన ఎగ్జిట్‌పోల్స్ ఫలితాల్లో బీజేపీ 62-68 స్థానాలు సాధించనుండగా మూడు పార్టీల అలయన్స్ అయినా మహా ఘట్‌బంధన్ అనుకున్న ఫలితాలను సాధించలేకపోయింది. దీంతో మహ ఘట్‌బంధన్‌కు 10 నుండి 16 స్థానాలు మాత్రమే గెలుపుపోందనుంది.

మహఘట్‌బంధన్..విఫలం

మహఘట్‌బంధన్..విఫలం

కాగా యూపిలో బీజేపీకి గట్టిపోటి ఇచ్చేందుకు ఎస్పీ,బీఎస్పీలతో పాటు ఇతర పార్టీలు కలిసి రంగంలోకి దిగాయి. ఓవైపు మాయవతి, మరోవైపు అఖిలేష్ యాదవ్‌లతో పాటు కమ్యునిస్టులు సైతం వీరికి తోడయ్యారు. అయినా బీజేపీ సీట్లను మాత్రం తగ్గించలేకపోయారు.అయితే ఓట్ల షేరింగ్ లో బీజేపీని ఢీకొట్టలేకపోయారు. అన్ని పార్టీలు కలిసిన ఓట్లషేరింగ్‌లో మాత్రం గతంలో కంటే మరో 4 శాతం ఎక్కువగా సాధించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+