‘నో డేటా ఎవలేబుల్’: ఎన్డీఏకు కొత్త అర్థం చెబుతూ రాహుల్ గాంధీ సెటైర్లు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి నరేంద్ర మోడీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికార ఎన్‌డీఏను "నో డేటా అవలేబుల్" అంటూ సెటైర్లు వేశారు. మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు ట్విట్టర్‌లో.. "ఆక్సిజన్ కొరతతో ఎవరూ చనిపోలేదు, నిరసనలో రైతు మరణించలేదు, వలస వచ్చినవారు ఎవరూ చనిపోలేదు, ఎవరూ మూకుమ్మడిగా కొట్టబడలేదు, ఏ జర్నలిస్టును అరెస్టు కాలేదు." అంటూ విమర్శించారు.
ధరల పెరుగుదల, రోజువారీ నిత్యావసరాలపై జీఎస్‌టి సమస్యలను పార్లమెంటులో కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు లేవనెత్తేందుకు ప్రయత్నించి ఆందోళనలు చేశాయి. దీంతో సభలు వాయిదా పడ్డాయి. ధరల పెరుగుదల, నిత్యావసర వస్తువులపై కేంద్రం జీఎస్టీ విధించడంపై ప్రతిపక్షాలు తమ డిమాండ్లపై నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాహుల్ తాజాగా ఈ మేరకు ట్వీట్ చేశారు. బీజేపీ నేతలు కూడా రాహుల్ ట్వీట్ కు కౌంటర్లు ఇస్తున్నారు.

మరోవైపు, విపక్షాల నిరసనలతో రాజ్యసభ, లోక్‌సభ వర్షాకాల సమావేశాలు మొదటి నాలుగు రోజుల పాటు వాయిదా పడ్డాయి. సమావేశమైన కొద్ది నిమిషాలకే సభలు వాయిదా పడ్డాయి. రాజ్యసభ, లోక్‌సభలు ఆ రోజుల్లో ఎటువంటి ముఖ్యమైన లావాదేవీలను నిర్వహించడంలో విఫలమయ్యాయి.
పార్లమెంటులో గందరగోళం మధ్య.. కాంగ్రెస్ గురువారం లోక్‌సభ, రాజ్యసభలు పనిచేయాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయని, అయితే ఈ సెషన్‌లో మొదటి చర్చ ధరల పెరుగుదల, రోజువారీ ఉపయోగించే కొన్ని ఆహార పదార్థాలపై జీఎస్‌టి విధింపుపై జరగాలనేది తమ ఏకైక డిమాండ్ అని పేర్కొంది.
‘No Data Available’ (NDA) govt wants you to believe:
— Rahul Gandhi (@RahulGandhi) July 23, 2022
• No one died of oxygen shortage
• No farmer died protesting
• No migrant died walking
• No one was mob lynched
• No journalist has been arrested
No Data. No Answers. No Accountabilty. pic.twitter.com/mtbNkkBoXe
ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ మాట్లాడుతూ.. ధరల పెరుగుదల, కొన్ని ఆహార పదార్థాలపై జీఎస్‌టీ పెంపుపై తక్షణమే చర్చ జరగాలని ప్రతిపక్షాల పక్షం నుంచి ఒక్కటే డిమాండ్ ఉందన్నారు.
"మేము పార్లమెంటు పనిచేయాలని కోరుకుంటున్నాము, అయితే మొదటి చర్చ ధరల పెరుగుదల, ఆహార పదార్థాలపై GST పెంపుపై జరగాలని మా ఒక డిమాండ్' అని ఆయన అన్నారు. చర్చకు సిద్ధమని ప్రభుత్వం కూడా చెబుతోందని కానీ, చర్చ మాత్రం జరగడం లేదని అన్నారు.












Click it and Unblock the Notifications