మోదీ- షా లెక్క తప్పింది అక్కడే, భంగపాటు దిద్దుబాట: అనూహ్య నిర్ణయం..!!
జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మహిళా రిజర్వేషన్ల బిల్లు లోక్ సభలో వీగిపోయింది. డీలిమిటేషన్ బిల్లును కేంద్రం విత్ డ్రా చేసుకుంది. దీంతో.. ఎన్డీఏ పక్షాలు కాంగ్రెస్ కూటమిని టార్గెట్ చేస్తున్నాయి. మోదీ ప్రధాని అయిన తరువాత పార్లమెంట్ లో వీగిన తొలి బిల్లు ఇదే. దీంతో.. ఈ పరిణామాలను మోదీ టీం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. ఈ విషయంలో కాంప్రమైజ్ కాకూడదని భావిస్తోంది. బిల్లు ఆమోదం కోసం ప్రత్యామ్నాయ మార్గాల పై కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా అనూహ్య నిర్ణయం తీసుకుంది.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వానికి షాక్ తగిలింది. ప్రతిష్ఠాత్మకంగా భావించిన మహిళా రిజర్వేషన్ల సవరణ బిల్లు వీగిపోయింది. దీంతో.. ప్రతిపక్షం ఇది ప్రజాస్వామ్య విజయం గా ప్రచారం చేస్తోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ కూటమి మహిళా వ్యతిరేక పార్టీలుగా నిరసనలు కొన సాగిస్తోంది. దీంతో.. కేంద్రం ఈ వ్యవహారంలో భవిష్యత్ కార్యాచరణ పైన కసరత్తు చేస్తోంది. కాగా..
రాజ్యాంగ సవరణ బిల్లు పేరుతో మహిళా రిజర్వేషన్‌ను అమలు చేయడంతో పాటు లోక్‌సభ సీట్లను పెంచాలన్న వ్యూహం బెడిసికొట్టడంతో కొత్త కార్యాచరణ సిద్దం చేస్తోంది. ఈ భంగపాటు నుంచి బయటపడాలంటే జులైలో జరిగే వర్షాకాల సమావేశాల్లో మళ్లీ మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులను ప్రవేశ పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా భావిస్తున్నారు. గురువారం రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన తర్వాత మోదీ, షా సమావేశమై కీలక చర్చలు జరిపినట్లు తెలిసింది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రతిపక్షాలను ఎందుకు ఒప్పించలేకపోయామన్న చర్చ వారిద్దరి మధ్య సాగుతోంది.

మళ్లీ పార్లమెంట్ లో బిల్లు..!
ప్రతిపక్షాలను చీల్చడంలో విఫలం కాగా పైగా వారిని సంఘటితం చేసేందుకు దోహదం చేశామని వారు గ్రహించారు. ఇదే ఐక్యత వారి మధ్య కొనసాగితే తమకు నష్టమని వారు భావిస్తున్నట్లు తెలిసింది. లోక్‌సభ లో గురువారం కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లుపై ఓటింగ్ జరిగినపుడు కనీసం 11 మంది గైర్హాజరయ్యారని తెలుస్తోంది. లోక్‌సభలో స్పీకర్ కాక సంఖ్యాబలం 542. మూడు ఖాళీలు ఉన్నాయి. సభలో ఉండాల్సిన 539 మందిలో 528 మంది సభ్యులు ఓటు వేశారు. వీరిలో బిల్లుకు అనుకూలంగా 298 మంది, వ్యతిరేకంగా 230 మంది ఓటు వేశారు. అంటే ప్రతిపక్షాలు దాదాపు సంఘటితంగా మారాయని అర్థమవుతోంది. విపక్షాలు మహిళా బిల్లును అడ్డుకున్నారని గట్టిగా ప్రచారం చేయాలని, ఎన్నికలు ముగిసిన వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, డీలిమిటేషన్‌పై ఏకాభిప్రాయ సాధనకు రావాలని బీజేపీ వర్గాలు యోచిస్తున్నాయి. అప్పటికీ ప్రతిపక్షాలు ఒప్పుకోకపోతే తదుపరి పరిణామాలకు బాధ్యులుగా వారిపై నింద వేసేందుకు ఆస్కారం ఉంటుందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. డీలిమిటేషన్ బిల్లులను ప్రవేశపెట్టడంపై ఎన్డీఏ ఎంపీల్లో కూడా తీవ్ర చర్చలు సాగుతున్నాయి. దీంతో.. ఈ రోజు జరిగే మంత్రివర్గ భేటీతో పాటుగా.. ఎన్డీఏ పార్టీల సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications