తొందరేంలేదు, 5న విచారిస్తాం: ఎన్డీటీవీ పిటిషన్‌పై సుప్రీం
న్యూఢిల్లీ: ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఎన్డీటీవీ ఇండియా ప్రసారాలను ఒక్క రోజు నిలిపివేయాలని కేంద్రం జారీ చేసిన నిషేధ ఉత్తర్వులకు సంబంధించిన అంశంపై డిసెంబరు 5న విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు మంగళవారం వెల్లడించింది.
పఠాన్‌కోట్ తీవ్రవాద దాడికి సంబంధించి కవరేజీ వ్యవహారంలో నవంబర్ 9న ఎన్డీటీవీ ప్రసారాలు నిలిపివేయాలంటూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసి తర్వాత ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపేసిన సంగతి తెలిసిందే.

అయితే కేంద్రం తమ ఛానల్‌పై ఒక రోజు నిషేధం వేయడాన్ని సవాలు చేస్తూ ఎన్డీటీవీ సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను మంగళవారం విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు డిసెంబరు 5న దీనిపై విచారణ చేయనున్నట్లు తెలిపింది.
ఎన్డీటీవీ అంశం విచారణపై తొందరేమీ లేదని అటార్నీ జనరల్ కోర్టుకు తెలిపారు. ఇందుకు కోర్టుకు కూడా సానుకూలంగా స్పందించింది. డిసెంబర్ 5న విచారిస్తామని స్పష్టం చేసింది.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications