పట్టపగలు ఎటిఎం వ్యాన్ నుంచి రూ. 2 కోట్లు లూటీ

ముంబై: పట్టపగలు ముంబైలోని ఎటిఎం వ్యాన్‌లో శుక్రవారం దోపడీ జరిగింది. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు. ఎటిఎం వ్యాన్‌లో సగం డబ్బులు, దాదాపు రూ. 2 కోట్లను దుండగులు దోచుకెళ్లారని డిప్యూటీ పోలీసు కమిషనర్ వీరేంద్ర మిశ్రా చెప్పారు.

శుక్రవారం సాయంత్రం ముంబైలోని సబర్బన్ విలే పార్లెలో నలుగురు వ్యక్తులు ఈ దోపిడీకి పాల్పిడినట్లు ఆయన తెలిపారు. దోపిడీకి పాల్పడినవారిలో సెక్యూరిటీ కంపెనీకి చెందిన ఓ ఉద్యోగి కూడా ఉన్నట్లు ఆయన చెప్పారు. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం 2 గంటల ప్రాంతంలో జరిగింది.

Nearly Rs 2 crore looted from ATM van in in Mumbai

ఎటిఎం వ్యాన్ లోయర్ ప్యారెల్ ఏరియా నుంచి బయలుదేరింది. దాన్ని ఓ కారు అడ్డగించింది. ముగ్గురు వ్యక్తులు అందులోంచి దిగి డబ్బులు ఎత్తుకుని పారిపోయినట్లు మిశ్రా చెప్పారు. తమకు లభించిన క్లూస్ ఆధారంగా ప్రతి కోణంలో కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

దొంగలతో చేతులు కలిపిన సెక్యూరిటీ గార్డును సాద్రే ఆలంగా గుర్తించారు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరో ముగ్గురి కోసం కూడా పోలీసులు వేట సాగిస్తున్నారు. ఎంటిఎం వ్యాన్‌లో రెండు కోట్ల 36 లక్షల రూపాయల ఉన్నాయని, అందులోంచి కోటీ 95 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారని మిశ్రా చెప్పారు. మత్తు కలిపిన ద్రవపదార్థాలను దుండగులు వాడినట్లు గుర్తించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+