100 జన్మలు ఎత్తాలి: శరద్ పవార్ వ్యాఖ్యలపై సంజయ్ రౌత్
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు అంశం మూడడుగులు ముందుకు ఆరడుగులు వెనక్కు అన్న చందంగా మారింది. కాంగ్రెస్-ఎన్సీపీతో కలిసి శివసేన ప్రభుత్వం ఏర్పాటు ఖాయమనుకొన్న తరుణంలో శరద్ పవార్ బాంబ్ పేల్చారు. దీంతో కూటమి ఏర్పాటుపై అనుమానాలు తలెత్తుతున్నాయి. దీనిపై మీడియాలో రకరకాల కథనాలు వెలువడుతుండగా ఎన్సీపీ నేత సంజయ్ రౌత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏం డిస్కష్ చేశామంటే..
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో సమావేశం తర్వాత ఎన్సీపీ అధినేత శరద్ పవార్ హాట్ కామెంట్స్ చేశారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించలేదని, సంఖ్యాబలంపై మాత్రమే డిస్కష్ చేశామని చెప్పారు. అలాగే శివసేన 170 సభ్యుల మద్దతు ఉందని చెబుతోంది. అదేలా సాధ్యం అని కామెంట్స్ చేశారు. దీంతో శివసేన కూటమి ఆశలపై నీళ్లు చల్లారా అనిపించింది. ఆ వెంటనే పవార్‌తో సంజయ్ రౌత్ కూడా సమావేశమయ్యారు. ఎన్సీపీని కాకుండా బీజేపీని దుమ్మెత్తిపోయడంతో.. ఏం జరిగిందా అనే చర్చకు దారితీసింది.

వంద జన్మలెత్తాలట..?
శరద్ పవార్ వ్యాఖ్యలపై మంగళవారం సంజయ్ రౌత్ స్పందించారు. పవార్ వ్యాఖ్యలను అర్థం చేసుకోవాలంటే మరో వంద జన్మలు ఎత్తాలని పేర్కొన్నారు. ఆయన కామెంట్లు అంత వీజీగా అర్థం కావు అని పేర్కొన్నారు. తమ కూటమిపై ఆందోళన చెందొద్దని మీడియా ప్రతినిధులకు సూచించారు. త్వరలోనే కూటమికి అంకురార్పణ జరుగుతుందని వివరించారు. డిసెంబర్ మొదటివారంలో కూటమి ఏర్పాటవడం ఖాయమని స్పష్టంచేశారు. ఐదేళ్లపాటు స్థిరంగా పాలిస్తోందని సంజయ్ రౌత్ ధీమా వ్యక్తం చేశారు. శివసేన నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటవడంలో ఎలాంటి అనుమానాలు, అపోహలకు తావులేదని తేల్చిచెప్పారు. కానీ మీడియా మాత్రం తప్పుగా ప్రచారం చేస్తోందని ఆరోపించారు.

రైతుల గురించే..
మహారాష్ట్రలో రైతుల గురించి శరద్ పవార్ దృష్టిసారించారని సంజయ్ రౌత్ చెప్పారు. రుణమాఫీ, మద్దతు ధర లాంటి హామీలపై పట్టుబడుతున్నారని సంజయ్ రౌత్ తెలిపారు. అయితే రాజ్యసభ 250వ సెషన్ సందర్భంగా ప్రధాని మోడీ.. శరద్ పవార్‌ను పొగడ్తల్లో ముంచెత్తడంపై అనుమానించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. పవార్ తన గురువుతో సమానమని ప్రధాని మోడీ చాలా సందర్భాల్లో చెప్పిన విషయాన్ని సంజయ్ రౌత్ గుర్తుచేశారు. కానీ దానిని రాజకీయాలకు ముడివేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. బోడిగుండుకు మోకాలికి ఎందుకు ముడిపెడతారని ఆయన ప్రశ్నించారు.

రానీ మెజార్టీ
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాలేదు. గత 35 ఏళ్ల నుంచి కలిసిపోటీ చేస్తున్న బీజేపీ-శివసేన మధ్య సీఎం సీటు కోసం పీటముడి నెలకొంది. దీంతో ఆ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయబోమని తేల్చిచెప్పాయి. దీంతో ఇతర పార్టీలతో కలిసి పోటీ చేసేందుకు శివసేన ముందుకొచ్చింది. కాంగ్రెస్, ఎన్సీపీతో చర్చలు ఒకడుగు ముందుకు పడితే, మూడగుడులు వెనక్కి పడుతున్నాయి.

దూరం.. దూరంగా...
పార్లమెంట్ సమావేశాలకు ముందు అఖిలపక్ష సమావేశానికి శివసేన హాజరుకాలేదు. దీనికి బీజేపీ కూడా ధీటుగానే స్పందించింది. పార్లమెంట్‌లో శివసేన సీట్లను మార్చివేసింది. ప్రతిపక్షంలో ఐదో వరసకు ఛేంజ్ చేసింది. మహారాష్ట్రలో ప్రతిష్టంభనతో అంతకుముందే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న శివసేన మంత్రులు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాము ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగినట్టేనని.. కానీ దానిని అధికారికంగా ప్రకటించాల్సి ఉందని చెప్పారు.

స్నేహహస్తం..
బీజేపీతో పొత్తు బెడిసికొట్టడంతో కాంగ్రెస్, ఎన్సీపీలకు శివసేన స్నేహహస్తం అందించింది. ప్రభుత్వ ఏర్పాటు ఓకే అని సంకేతాలు వెలువడ్డాయి. కనీస ఉమ్మడి ప్రణాళిక రూపొందించి ఆమోదం తెలిపారు. కానీ సోమవారం సోనియాతో పవార్ భేటీ తర్వాత చేసిన కామెంట్లు.. హీట్ పుట్టించాయి. ఈ క్రమంలోనే పవార్ మాటలను అర్థం చేసుకోవాలంటే వందేళ్లు పడుతుందని సంజయ్ రౌత్ కామెంట్ చేశారు.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications