'నేను సెక్స్ కోసం బయటకెళ్లాలి... నాకు ఈపాస్ ఇవ్వగలరు...' కేరళ పోలీసులకు ఓ వ్యక్తి దరఖాస్తు...
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా దేశంలోని చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్ అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. కేవలం అత్యవసర సర్వీసులకు మాత్రమే ఆయా రాష్ట్రాలు మినహాయింపులు ఇచ్చాయి. అలాగే అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లేవారికి ఈ-పాస్‌లు జారీ చేస్తున్నాయి. సరైన కారణం ఉంటేనే అధికారులు ఈపాస్ జారీ చేస్తున్నారు. తాజాగా కేరళకు చెందిన ఓ వ్యక్తి ఈపాస్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అందులో అతను చెప్పిన కారణం వింటే షాక్ తినాల్సిందే.

'సెక్స్' కోసం ఈపాస్‌కు దరఖాస్తు...
'నేను సెక్స్ కోసం బయటకు వెళ్లాలి... నాకు ఈపాస్ ఇవ్వగలరు...' అంటూ కేరళలోని కన్నూరు జిల్లా కన్నప్పురంకు చెందిన ఓ వ్యక్తి పోలీసులకు దరఖాస్తు చేసుకున్నాడు. ఆ కారణం విని పోలీసులు షాక్ తిన్నారు. విషయాన్ని ఏసీపీ దృష్టికి తీసుకెళ్లారు.దీంతో ఆ వ్యక్తిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారించాల్సిందిగా ఏసీపీ ఆదేశించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీస్ టీమ్ అతని చిరునామా వెతికి పట్టుకున్నారు. అతన్ని పోలీస్ స్టేషన్‌కి తీసుకొచ్చి ప్రశ్నించారు.

సిక్స్ అని రాయబోయి అలా..
అతను చెప్పిన సమాధానం విని పోలీసులు మళ్లీ షాక్ తిన్నారు. నిజానికి తాను దరఖాస్తులో 'సిక్స్' అని రాయబోయి 'సెక్స్' అని రాసినట్లు సదరు వ్యక్తి పోలీసులతో చెప్పాడు. 'నేను సిక్స్‌కి బయటకు వెళ్లాలనుకుంటున్నాను... అని రాయబోయి పొరపాటున సెక్స్ అని రాసినట్లు చెప్పాడు. దీంతో అవాక్కయిన పోలీసులు మరోసారి ఇలాంటి పొరపాటు చేయవద్దని మందలించారు.అత్యవసరమైతే తప్ప ఈపాస్ కోసం దరఖాస్తు చేయవద్దని హెచ్చరించారు. జరిగిన దానికి క్షమాపణలు చెప్పడంతో పోలీసులు అతన్ని పంపించేశారు.
Recommended Video

బిహార్‌లోనూ ఇలాంటి ఘటన...
కేరళలోనే కాదు గత వారం బిహార్‌లోనూ ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. తన ముఖంపై మొటిమలకు చికిత్స చేయించుకోవాలనుకుంటున్నానని.. ఇందుకోసం తనకు ఈపాస్ జారీ చేయాలని ఓ యువకుడు అక్కడి పోలీసులకు దరఖాస్తు చేసుకున్నాడు. కరోనా వేళ అత్యవసరమైతే తప్ప రావొద్దని ఓవైపు అంతా మొత్తుకుంటుంటే.. ముఖంపై మొటిమలకు చికిత్స పేరుతో అతను చేసిన దరఖాస్తు చూసి పోలీసులకు నవ్వాలో ఏడ్వాలో అర్థం కాలేదు. నిజానికి ఈపాస్ కోసం వచ్చే దరఖాస్తుల్లో చాలావరకు సరైన కారణంతోనే ఉంటున్నాయని... ఏవో కొన్ని మాత్రం ఇలా సిల్లీ కారణాలతో ఉంటున్నాయని బిహార్ ఐఏఎస్ అధికారి రాహుల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'బ్రదర్... నీ మొటిమల చికిత్సకు వెయిట్ చెయ్ ఫర్వాలేదు...' అంటూ సదరు యువకుడికి సూచించారు.












Click it and Unblock the Notifications