కర్ణాటక మొదటి మహిళా డీజీపీగా నీలమణి ఎన్. రాజు: చివరి వరకూ ఎన్ఎం. రెడ్డి పోటీ !
కర్ణాటక కొత్త డీజీపీగా నీలమణి ఎన్. రాజురాష్ట్ర చరిత్రలో పోలీస్ బాస్ గా మొదటి మహిళా ఐపీఎస్ చివరి వరకు పోటీపడిన ఐపీఎస్ లు ఎంఎన్ రెడ్డి, కిశోర్ చంద్ర
బెంగళూరు: కర్ణాటక కొత్త డీజీపీగా మొదటి సారి మహిళా ఐపీఎస్ అధికారిణి నీలమణి ఎన్. రాజు బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ప్రస్తుత డీజీపీ రూప్ కుమార్ దత్త (ఆర్ కే దత్త) అక్టోబర్ 31వ తేదీ మంగళవారం సాయంత్రం పదవి విరమణ చేస్తున్నారు. కొత్త డీజీపీ రేసులో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులు చివరి వరకూ పోటీ పడ్డారు.
సీనియారిటీ ప్రకారం పరిగణలోకి తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం కొత్త డీజీపీగా నీలమణి ఎన్. రాజును నియమిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం సాయంత్రం బెంగళూరు నగరంలోని నృపతుంగ రోడ్డులో ఆర్ కే దత్త నుంచి నీలమణి ఎన్. రాజు బాధ్యతలు స్వీకరిస్తున్నారు.

1983 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారిణి నీలమణి రాజు 25 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో విధులు నిర్వహించారు. ఇటీవల కర్ణాటక చేరుకున్న నీలమణి ఎన్. రాజు ఇంటలిజెన్స్, రాష్ట్ర హోంగార్డులు, అగ్నిమాపక శాఖల డీజీపీగా బాధ్యతలు నిర్విహించారు. సీనియర్ ఐపీఎస్ అధికారులు ఎంఎన్. రెడ్డి, కిశోర్ చంద్ర చివరి వరకూ నీలమణి ఎన్. రాజుతో డీజీపీ కుర్చికోసం పోటీ పడ్డారు.












Click it and Unblock the Notifications