నీట్ ఫలితాల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సుప్రీం
ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ ఫలితాల విడుదలకు గల అడ్డంకులు తొలగిపోయాయి.
న్యూఢిల్లీ: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్) ఫలితాల విడుదలకు గల అడ్డంకులు తొలగిపోయాయి. ఫలితాల విడుదలను నిలిపివేయాలని గతంలో కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై సోమవారం సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో నీట్ ఫలితాల విడుదలకు మార్గం సుగమమైంది.
నీట్ ఫలితాలను నిలిపివేయాలని గతంలో మద్రసు హైకోర్టు తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. తమిళ, ఆంగ్ల భాషల ప్రశ్నాపత్రాల మధ్య తేడా ఉందని, అందువల్ల పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని అక్కడి విద్యార్థులు కొందరు మద్రాసు హైకోర్టును ఆశ్రయించడంతో ఫలితాల విడుదలను నిలిపివేయాలని తీర్పు చెప్పింది.

దీంతో ఈ తీర్పును సవాల్ చేస్తూ సీబీఎస్ఈ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సీబీఎస్ఈ పిటిషన్ పై సోమవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. మద్రాసు హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. నీట్ ఫలితాలను ప్రకటించాలని సీబీఎస్ఈని ఆదేశించింది. అంతేగాక, నీట్ అడ్మిషన్ల షెడ్యూల్ ను ప్రభావితం చేసే పిటిషన్‌లను హైకోర్టులు విచారించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!!












Click it and Unblock the Notifications