వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Covid-19:RT-PCR టెస్టులో నెగిటివ్.. CT-Scanలో పాజిటివ్: డాక్టర్ల మాటేమిటి..?

|
Google Oneindia TeluguNews

మీలో కరోనా లక్షణాలు కనిపించాయా..? రాపిడ్ యాంటిజెన్ టెస్టింగ్ చేయించుకున్నారా... ఆ తర్వాత ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకున్నారా.. టెస్టులో రిపోర్టు నెగిటివ్ అని వచ్చిందా... ఒకవేళ కరోనా రిపోర్టు నెగిటివ్‌గా వచ్చినా మీరు అలసత్వం ప్రదర్శించరాదు. కరోనా మళ్లీ సోకే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. చాలామంది పేషెంట్లు ఆర్టీపీసీఆర్ టెస్టులో నెగిటివ్ రిపోర్టు వచ్చినప్పటికీ వారిలో ఇంకా లక్షణాలు కనిపిస్తుండటంతో సీటీ స్కాన్ తీయగా వారి ఊపిరితిత్తులు కరోనాతో ఇన్‌ఫెక్ట్ అయి ఉందన్న అసలు విషయం వెలుగులోకి వస్తోంది. ఇది చూసిన డాక్టర్లు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇలాంటి కేసులు అధికంగా గుజరాత్‌లో వెలుగులోకి వచ్చాయి.

గుజరాత్‌లోని వడోదర మున్సిపల్ కార్పొరేషన్‌ పరిధిలో చాలామందిలో కరోనా లక్షణాలు కనిపించడంతో వారంతా కరోనా టెస్టులు చేయించుకున్నారు. అయితే రిపోర్టు మాత్రం నెగిటివ్‌గా వచ్చినప్పటికీ వారిలోని కరోనా లక్షణాలు మాత్రం అలానే ఉన్నాయి. దీంతో హాస్పిటల్‌ను సంప్రదించగా వైద్యులు సీటీ స్కాన్ చేయించుకోవాల్సిందిగా సూచించారు. సీటీ స్కాన్‌ను నిశితంగా పరిశీలించగా వారి ఊపిరితిత్తులకు కరోనా సోకినట్లు గమనించారు. ఆర్టీ పీసీఆర్‌ టెస్టుల్లో పాజిటివ్ చూపకపోయినప్పటికీ వారిలో లక్షణాలు ఉన్నాయని... బీమా సంస్థలు తప్పకుండా దీన్ని పరిగణలోకి తీసుకోవాలని వడోదర మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశాలు జారీ చేసింది.

Negative report in RT-PCR test not 100 percent authentic,CT-scan reveals infection in lungs

ఓ పేషెంటు ఆర్టీపీసీఆర్ రిపోర్టు చూస్తే నెగిటివ్ వచ్చిందని అయితే రేడియాలజీ రిపోర్టులను పరిశీలిస్తే వారిలో కరోనా ఉందన్న విషయం తెలిసిందని వారిని వెంటనే హాస్పిటల్‌లో అడ్మిట్ కావాలని సూచించినట్లు డాక్టర్ కృతేష్ షా చెప్పారు.ఒక పేషెంటులో సీటీ స్కాన్ తీయగా 25 పాయింట్లకు గాను 10 పాయింట్లు వచ్చాయని అంటే అతని ఊపిరితిత్తులు అప్పటికే కరోనా బారిన పడ్డాయని వివరించారు. ఇదిలా ఉంటే కరోనాలక్షణాలు కనిపించిన ఒకేసారి ఆర్టీ పీసీఆర్ టెస్టు, సీటీ స్కాన్‌ చేయించుకోవాలని సూచిస్తున్నట్లు మరో డాక్టర్ హితేన్ కరేలియా వెల్లడించారు. దీనివల్ల సమయం వృధా కాకుండా ట్రీట్‌మెంట్ త్వరగా ప్రారంభించొచ్చని చెప్పారు. చాలామంది పేషెంట్లలో కరోనా లక్షణాలు కనిపించడం లేదని అయితే వారి ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ వ్యాపించి ఉంటుందని స్పష్టం చేశారు డాక్టర్ కరేలియా.

ఆర్టీపీసీఆర్ టెస్టులో 70శాతం కచ్చితత్వం ఉంటే మరో 30శాతం కచ్చితత్వం ఉండదని వైద్యులు చెబుతున్నారు. అయతే సీటీ స్కాన్‌లో బయటపడితే ఆ వ్యక్తి కరోనాబారిన పడ్డట్టే అని చెబుతున్నారు. ఇలా చాలా చోట్ల ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో కరోనా నెగిటివ్ రిపోర్టు వచ్చినప్పటికీ... వారిలో లక్షణాలు తగ్గకపోవడంతో సీటీ స్కాన్ తీయిస్తుండగా అప్పటికే ఊపిరితిత్తుల్లోకి వైరస్ ప్రవేశించి ఉంటుందని చెబుతున్నారు.

English summary
RT-PCR tests are not showing the accurate results says Gujarat Doctors. Though the RTPCR test shows negative for covid, when CT-Scan is taken the virus have already infected the lungs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X